Movie News

రావణాసుర ‘ఎ’ వెనుక కథ

మాస్ రాజా రవితేజ సినిమాలంటే ఫ్యామిలీ మొత్తం చూసేలా ఉంటాయి. యాక్షన్ డోస్ కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ.. ఏ వర్గం ప్రేక్షకులైనా చూసేలాగే ఆయన సినిమాలు తెరకెక్కుతుంటాయి. అలాంటి హీరో సినిమాకు ‘ఎ’ సర్టిఫికెట్ రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మాస్ రాజా కొత్త చిత్రం ‘రావణాసుర’కు ఇటీవలే సెన్సార్ పూర్తి కాగా.. దానికి ‘ఎ’ సర్టిఫికెట్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

‘రావణాసుర’ ట్రైలర్ చూస్తే హింస మోతాదు కొంచెం ఎక్కువ ఉన్నట్లే కనిపించింది. అంతమాత్రాన ‘ఎ‘ ఇవ్వడం ఏంటి అన్న సందేహాలు కలిగాయి. మాస్ రాజా సినిమా అంటే పిల్లలు బాగానే థియేటర్లకు వస్తారు. మరి వాళ్లు చూడకూడని సినిమా చేశాడా రవితేజ అన్న చర్చ నడుస్తోంది. ఐతే ‘రావణాసుర’కు ‘ఎ’ ఇవ్వడానికి దాని టీం పట్టుదలే కారణం అని సమాచారం.

ఓ బెంగాలీ సినిమా ఆధారంగా తెరకెక్కిన ‘రావణాసుర’ను.. దర్శకుడు సుధీర్ వర్మ తన అభిమాన హాలీవుడ్ డైరెక్టర్ క్వింటన్ టొరంటినో సినిమాల తరహాలో తీశాడట. టొరంటినో సినిమాల్లో వయొలెన్స్ మోతాదు కొంచెం ఎక్కువే ఉంటుంది. అలాగే బూతులు వెల్లువలా వచ్చి పడుతుంటాయి. సన్నివేశాలు చాలా ‘రా’గా కూడా ఉంటాయి. ‘రావణాసుర’ కథను ఈ స్టయిల్లో చెబితే దానికి న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో హింస, బూతుల మోతాదు కొంచెం ఎక్కువగానే ఉండేలా చూసుకున్నాడట సుధీర్ వర్మ. సినిమా సెన్సార్‌కు వెళ్లినపుడు బోర్డు వాళ్లు చాలా కట్స్ చెప్పారట. ఆ కట్స్ అన్నింటికీ ఓకే చెబితే సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ ఇవ్వడానికి రెడీ అయ్యారట.

ఐతే వాళ్లు చెప్పిన కట్స్ అన్నిటికీ ఓకే చెబితే సినిమా ఎసెన్సే దెబ్బ తింటుందన్న ఉద్దేశంతో ‘ఎ’ ఇచ్చినా పర్వాలేదు కట్స్‌కు మాత్రం నో అన్నారట. అలా ఈ సినిమాకు ‘ఎ’ వచ్చినట్లు సమాచారం. ఐతే పోస్టర్ మీద ‘ఎ’ ఉందంటే ఫ్యామిలీస్, పిల్లలు సినిమా చూడ్డం కష్టమే. సింగిల్ స్క్రీన్లలో ఏమో కానీ.. మల్టీప్లెక్సుల్లో అసలు పిల్లల్ని లోనికే అనుమతించరు.

This post was last modified on April 4, 2023 3:16 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

చంద్ర‌బాబు పేరిట త‌ప్పుడు ప్ర‌చారం.. స్ట్రాంగ్ వార్నింగ్‌

ఏపీలో పోలింగ్ ప్ర‌క్రియ‌కు మ‌రికొన్ని గంట‌ల ముందు.. సంచ‌ల‌నం చోటు చేసుకుంది. కూట‌మి పార్టీల ముఖ్య నేత‌, టీడీపీ అధినేత…

5 hours ago

జ‌గ‌న్ చేయాల్సిన ప‌ని.. బాబు చేస్తున్నారు..

ఏపీలో చిత్ర‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. శ‌నివారం సాయంత్రంతో ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసిపోవ‌డంతో నాయ‌కులు, పార్టీల అధినే త‌లు ఎక్క‌డిక‌క్క‌డ సేద…

6 hours ago

బెట్టింగ్ లో రూ.2 కోట్లు .. కొట్టిచంపిన తండ్రి

బెట్టింగ్‌లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడిని తండ్రి హతమార్చిన ఘటన మెదక్‌ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం బగిరాత్‌పల్లిలో చోటు చేసుకుంది.…

6 hours ago

పవన్‌కు ప్రాణం, జగన్‌కు ఓటు.. మారుతుందా?

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్లో యూత్‌లో పవన్‌కు ఉన్నది మామూలు క్రేజ్ కాదు. సినిమాల్లో సూపర్ స్టార్ ఇమేజ్ వల్ల…

7 hours ago

జగన్‌ సీట్లపై పీకే లేటెస్ట్ అంచనా

ఆంధ్రప్రదేశ్‌లో గత పర్యాయం వైఎస్సార్ కాంగ్రెస్ 151 సీట్లతో ఘనవిజయం సాధించడంలో ఆ పార్టీకి వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్…

8 hours ago

ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్‌

దాదాపు 55 రోజుల పాటు అవిశ్రాంతంగా పార్ల‌మెంటు ఎన్నిక‌ల ప్ర‌చారం చేసిన తెలంగాణ ముఖ్య‌మంత్రి, కాంగ్రెస్ పీసీసీచీఫ్ ఎనుముల రేవంత్…

9 hours ago