ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ రేసు గుర్రంలో విలన్ గా నటించాకే రవికిషన్ కు టాలీవుడ్ లో గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలు చాలానే చేశారు. అయితే అధికశాతం జనాలకు తెలియని విషయం ఏంటంటే ఇతగాడు భోజ్ పూరి భాషలో స్టార్ హీరో. మంచి హిట్లున్నాయి. అయితే మార్కెట్లు రెమ్యునరేషన్లు గట్రా బాగా తక్కువ. అందుకే వేరే లాంగ్వేజెస్ లోనూ ప్రూవ్ చేసుకుని ఆదాయం పెంచుకునే ఉద్దేశంతో తెలుగు తమిళంలో విస్తృతంగా నటించాడు.ఇతనికి నగ్మాకి ఏదో సంథింగ్ ఉందనే గాసిప్ నార్త్ మీడియాలో గత కొంతకాలంగా ప్రచారంలో ఉంది.
నగ్మా ఎవరో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. 90 దశకంలో ఘరానా మొగుడు, కిల్లర్, పెద్దింటల్లుడు, వారసుడు, మేజర్ చంద్రకాంత్ లాంటి సూపర్ హిట్స్ తో ఓ రేంజ్ మార్కెట్ ని ఎంజాయ్ చేసింది. కాకపోతే త్వరగా కనుమరుగయ్యింది. అక్కడితో కెరీర్ అయిపోలేదు. భోజ్ పూరిలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాక రవికిషన్ కాంబోలో సక్సెస్ ఫుల్ మూవీస్ వచ్చాయి. ఆ సమయంలోనే వీళ్లిద్దరి బంధం గురించి వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనికి సంబంధించి ప్రముఖ టీవీ సెలబ్రిటీ షో ఆప్ కి అదాలత్ లో రవికిషన్ నేరుగా స్పందించి కుండబద్దలు కొట్టే ప్రయత్నం చేశాడు
తాను నగ్మా మంచి స్నేహితులమే తప్ప ఇంకేదీ లేదని, భార్య ప్రీతీ శుక్లాను ఎంతగానో గౌరవించి ప్రేమించే తనకు ఎలాంటి దురుదేశాలు లేవని, ఈ విషయాన్నీ చాలాసార్లు చెప్పిన సందర్భాన్ని గుర్తు చేశారు. అంతేకాదు ఆమె పాదాలకు నమస్కరించిన ఉదంతాన్ని కూడా చెప్పారు. ఒకప్పుడు పొగరుతో ఉన్న తనను బిగ్ బాస్ హౌస్ కి పంపించి మూడు నెలల తర్వాత మారిన మనిషిలా వచ్చేలా చేసిన ఘనత శ్రీమతికే దక్కుతుందని కితాబు ఇచ్చాడు. నగ్మాతో రిలేషన్ గురించి కన్నా భార్య గురించే ఓ రేంజ్ లో ఎలివేషన్లు ఇచ్చిన రవికిషన్ లో మంచి భర్త ఉన్నాడన్న మాట.
This post was last modified on April 4, 2023 10:50 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…