ఒకేసారి మూడు ప్యాన్ ఇండియా సినిమాలను సెట్ల మీద ఉంచి క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ప్రభాస్ ని ఎప్పుడెప్పుడా చూద్దామాని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఆది పురుష్ మీద అంచనాల సంగతేమో కానీ వాళ్ళ గురి సలార్ మీదే ఎక్కువుందన్నది వాస్తవం. ఆ తర్వాత జనవరిలో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ప్రాజెక్ట్ కె ఖచ్చితంగా వస్తుందా రాదానే దాని మీద అనుమానాలు తొలగిపోలేదు. ఒకవేళ ఇది మిస్ అయితే మాత్రం మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ కామెడీ ఆ స్థానం తీసుకోవడం దాదాపు ఖాయమే. గత నాలుగైదు నెలలుగా దీని షూట్ వేగంగా జరుగుతోంది.
ఇందులో ఒకప్పటి క్రియేటివ్ జీనియస్ రామ్ గోపాల్ వర్మ ఒక చిన్న క్యామియో చేశారనే వార్త గట్టిగానే తిరుగుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా వేసిన ఒక టెర్రస్ సెట్ లో కీలక ఆర్టిస్టులతో పాటు వర్మ పాల్గొన్న ఒక ఎపిసోడ్ ని మారుతీ ఆల్రెడీ తీశారట. కాకపోతే ఆ సన్నివేశాలు అనుకున్నంత స్థాయిలో రాకపోవడంతో వాటిని ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఉంచాలో లేదో పోస్ట్ ప్రొడక్షన్ టైంలో నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. అయినా అదే పనిగా వర్మతో చేయించేంత క్యారెక్టర్ మారుతీ ఏం డిజైన్ చేసుంటాడనే డౌట్ అభిమానుల్లో కలుగుతోంది.
ఒకప్పుడు కల్ట్ డైరెక్టర్ గా వర్మకు ఎంత పేరున్నా గత కొన్నేళ్లుగా ఆయన చర్యలు, తీసిన సినిమాలు, సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు ట్వీట్ల కారణంగా విపరీతమైన నెగటివిటీని మూటగట్టుకున్నారు. హీరో ఎవరైనా సరే ఈయన ఫలానా చిత్రంలో ఉన్నారంటే అమాంతం దానికొచ్చే క్రేజ్ ఏమీ ఉండదు.అలాంటప్పుడు ఏదో ఎక్స్ ట్రాడినరీగా చేశారంటే తప్ప ఏదో ఆషామాషీ సీన్ల వల్ల ఒరిగే ప్రయోజనం శూన్యం. అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి ఇదంతా ప్రస్తుతానికి పుకారుగానే చక్కర్లు కొడుతోంది. రాజా డీలక్స్ అనే టైటిల్ దీనికి పరిశీలనలో ఉన్న సంగతి తెలిసిందే.
This post was last modified on April 3, 2023 3:29 pm
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……