నేచురల్ స్టార్ నాని కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన సినిమాగా ‘దసరా’ను చెప్పుకోవచ్చు. ఈ సినిమా బడ్జెట్, బిజినెస్, ఓపెనింగ్స్.. ఇలా ప్రతి విషయంలోనూ నానిని చాలా మెట్లు ఎక్కించేసింది. ఇంతకాలం మిడ్ రేంజ్ హీరోల్లో ఒకడిగా ఉన్న నాని.. ‘దసరా’తో టాప్ లీగ్ హీరోలకు దగ్గరగా వెళ్లిపోయాడు. రూ.60 కోట్ల బడ్జెట్, రూ.80 కోట్ల బిజినెస్ అంటే చిన్న విషయం కాదు. ఇక ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్ కూడా మయామూలుగా లేవు.
తొలి రోజు రూ.35 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రావడం చూసి ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. హిందీలో, తమిళంలో ఈ వారం పెద్ద హీరోల సినిమాలు రిలీజైనా.. వాటిని వెనక్కి నెట్టి ఇండియన్ బాక్సాఫీస్‌లో నంబర్ వన్ సినిమాగా కొనసాగుతోంది ‘దసరా’. తెలుగు రాష్ట్రాల్లోనే కాక రిలీజైన ప్రతి చోటా ‘దసరా’ అదరగొడుతోంది. యుఎస్‌లో ‘దసరా’ రాంపేజ్ మామూలుగా లేదు.
ప్రిమియర్లతోనే 6 లక్షల డాలర్లు కొల్లగొట్టి శనివారానికే మిలియన్ మార్కును టచ్ చేసేసింది దసరా.
కొన్ని నెలల ముందు పరిస్థితి చూస్తే నాని స్థాయి హీరోకు వంద కోట్ల వసూళ్లు అన్నది ఊహకైనా అందని విషయమే. కానీ ఇప్పుడు ‘దసరా’తో ఆ మైల్ స్టోన్‌ను అందుకోబోతున్నాడు నాని. శనివారానికే ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ.70 కోట్ల మైలురాయిని దాటేసింది. ఆదివారం అన్ని షోలు పూర్తయ్యేసరికి గ్రాస్ కలెక్షన్లు రూ.85 కోట్లకు చేరువ అవుతాయని భావిస్తున్నారు.
ఇంకా కొన్ని రోజులు సినిమా బాగానే ఆడే అవకాశం ఉంది కాబట్టి ఫుల్ రన్లో రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్కును అందుకోవడం కష్టమేమీ కాకపోవచ్చు. ఇక యుఎస్‌లో ఇప్పటికే నాని కెరీర్లో 8వ మిలియన్ డాలర్ల సినిమాగా ‘దసరా’ నిలిచింది. అది ముందు నుంచి లాంఛనం అనుకున్న విషయమే. ఇప్పుడీ చిత్రం 2 మిలియన్ మార్కును అందుకోవడం కూడా పక్కాగా కనిపిస్తోంది. ఆదివారం షోలన్నీ అయ్యేసరికి 1.75 మిలియన్ డాలర్ల వరకు వసూళ్లు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఫుల్ రన్లో 2 మిలియన్ మార్కును కచ్చితంగా అందుకోవచ్చు.
This post was last modified on April 2, 2023 4:28 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…