అదేంటో కొన్ని డేట్లు కాకతాళీయంగానే అయినా సినిమాల పరంగా భలే కలిసొస్తాయి. ఉదాహరణకు ఏప్రిల్ 28 తీసుకుంటే టాలీవుడ్ చరిత్రలో రికార్డులు సృష్టించిన ఎన్టీఆర్ అడవి రాముడు, బాహుబలి, యమలీల, పోకిరి ఆ డేట్ కి వచ్చినవే. ఇప్పుడు మార్చి 30 కూడా అదే వరసలో చేరేలా ఉంది. అయిదేళ్ల క్రితం 2017లో రిలీజైన రంగస్థలం అప్పటిదాకా రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాదు చాలా చోట్ల నాన్ బాహుబలి రికార్డులు నమోదు చేసింది.
దర్శకుడు సుకుమార్ మాస్ యాంగిల్ పూర్తిగా బయటికి వచ్చింద ఈ మూవీతోనే. సరిగ్గా నిన్న అదే తేదీకి దసరా వచ్చింది. అనూహ్యంగా ఇది నానికి హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలవబోతోంది. మొదటి రోజు రికార్డులకే ట్రేడ్ కి మాట రావడం లేదు. దీని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల స్వయానా సుక్కు శిష్యుడు కావడం గమనార్హం.
ఇదొక్కటే కాదు రంగస్థలంకు పని చేసిన కీలక సభ్యుల్లో ఇతనూ ఉన్నాడు. దాని సక్సెస్ మీట్ లో ప్రత్యేకంగా స్టేజి మీద పిలిచి మెచ్చుకోవడం ఇప్పుడు వీడియో రూపంలో వైరల్ అవుతోంది. రెండూ ముప్పై నలభై ఏళ్ళ వెనకటి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందటం, ఒకదాంట్లో అన్నయ్య మరోదాంట్లో స్నేహితుడు ట్రాజెడీ మీద రివెంజ్ చూపించడం ట్విస్ట్.
ఈ రకంగా మార్చి 30 సైతం ల్యాండ్ మార్క్ గా నిలిచిపోయేలా ఉంది. సెలవుల సీజన్ మొదలుకావడం, మండే ఎండల్లో జనాలు థియేటర్లకు వెళ్లేందుకు ఎక్కువ మొగ్గు చూపడం, పోటీలేని టైంలో కంటెంట్ ఏ మాత్రం బాగుందనే మాట వచ్చినా చాలు కలెక్షన్ కురిపించే వేసవి కావడం ఇవన్నీ దసరాకు ప్లస్ అవుతున్నాయి. అప్పట్లో రంగస్థలంలో రామ్ చరణ్ మేకోవర్ ఏ రకంగా షాక్ ఇచ్చిందో ఇప్పుడు నాని కొత్త వేషం సైతం అంతే గొప్పగా ప్రశంసలు అందుకుంటోంది. వీటిలో హీరోయిన్లుగా నటించిన సమంత, కీర్తి సురేష్ లకు సైతం మంచి పేరు రావడం మరో విశేషం
This post was last modified on March 31, 2023 6:37 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…