కోలీవుడ్ హీరో శింబుకు తెలుగులో ఒకప్పుడు మంచి ఇమేజ్ ఉండేది. మన్మథ సూపర్ హిట్ అయ్యాక ఇక్కడా ఫాలోయింగ్ వచ్చింది. వల్లభ లాంటివి ఒకటి రెండు కమర్షియల్ గా బాగానే ఆడినా తర్వాత వరస ఫ్లాపుల వల్ల మార్కెట్ దాదాపుగా పోయింది. ఆ మధ్య గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెలుగు డబ్బింగ్ లైఫ్ అఫ్ ముత్తుతో పలకరించాడు కానీ అది కనీస స్థాయిలో ఆడలేదు.
తాజాగా పాతు తలతో నిన్న ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తమిళనాడులో నాని దసరాకి సరిపడా థియేటర్లు రాకపోవడంలో వెట్రిమారన్ విడుదలై 1తో పాటు ఈ పాతు తల కూడా ప్రధాన కారణం. ఇక విషయానికి వస్తే పాతుతల కన్నడ బ్లాక్ బస్టర్ మఫ్టీ రీమేక్. ఒరిజినల్ చూసే వీరసింహారెడ్డిలో గెటప్ ని డిజైన్ చేయించామని బాలకృష్ణ వేద ఈవెంట్ లో చెప్పారు.
ఇక్కడా రీమేక్ చేసే ప్రయత్నాలు జరిగాయి కానీ స్టార్ ఇమేజ్ ఉన్న సీనియర్ జూనియర్ హీరోలు ఇద్దరు అవసరం పడటంతో కాంబినేషన్ కుదరలేదు. ఫైనల్ గా తమిళంలో శింబు, గౌతమ్ కార్తీక్(కడలి ఫేమ్)కాంబోతో సెట్ చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం వల్ల దీని మీద మంచి అంచనాలే ఉన్నాయి. అయితే రిజల్ట్ మాత్రం ఆశించిన స్థాయిలో వచ్చేలా లేదని టాక్ తో పాటు రివ్యూలు స్పష్టం చేస్తున్నాయి.
మఫ్టీలో శివరాజ్ కుమార్ ఎంట్రీ ఇంటర్వెల్ నుంచి ఉంటుంది. అక్కడి నుంచి స్క్రీన్ ప్లే ఇంకో లెవెల్ కు వెళ్ళిపోయి మంచి మాస్ స్టఫ్ ఇస్తుంది. కానీ పాతుతలలో ఫస్ట్ లోనే రివీల్ చేశారు. ఒక పెద్ద మాఫియా డాన్ ని పట్టుకోవడం కోసం కుర్ర పోలీస్ ఆఫీసర్ ఆ ప్రాంతానికి అండర్ కాప్ గా మారు వేషంలో వస్తాడు. ఇక్కడో సిస్టర్ సెంటిమెంట్ ఎపిసోడ్ ఉంటుంది. దర్శకుడు ఒబెలి ఎన్ కృష్ణ మఫ్టీ స్థాయిలో దీన్ని నిలబెట్టేందుకు శతవిధాల ప్రయత్నించాడు కానీ శింబు నటన. రెహమాన్ సంగీతం కొంత వరకు కాపాడినా ఫైనల్ గా పాతు తల అంచనాలు అందుకోలేకపోయింది. తెలుగు డబ్ చేసే ప్లాన్ లో ఉన్నారు నిర్మాతలు
This post was last modified on March 31, 2023 3:46 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…