టాలీవుడ్ లో సీనియర్ దర్శకుల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్స్ గా వర్క్ చేసిన వాళ్ళు ఇప్పుడు చాలా మంది దర్శకులుగా మారుతున్నారు. అందులో సుకుమార్ శిష్యులే ఎక్కువగా కనిపిస్తున్నారు. ‘ఉప్పెన’ తో సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు డైరెక్టర్ గా బెస్ట్ డెబ్యూ ఇచ్చి 100 కోట్ల గ్రాస్ లిస్టులో చేరాడు. ఇప్పుడు సుకుమార్ శిష్యుడిగా ‘దసరా’తో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా మారి ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
నాని హీరోగా తెరకెక్కిన దసరాతో డెబ్యూ ఇచ్చాడు శ్రీకాంత్ ఓదెల. అంతకుముందు సుకుమార్ దగ్గర నాన్నకు ప్రేమతో , రంగస్థలం సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేశాడు. సుకుమార్ ‘రంగస్థలం’ రిలీజైన రోజే తన ‘దసరా’ రిలీజ్ ప్లాన్ చేసుకున్న శ్రీకాంత్ తన మేకింగ్ స్టైల్ తో చాలా వరకు సుకుమార్ ను గుర్తుచేశాడు. దసరా లో కొన్ని షాట్స్ , మేకింగ్ స్టైల్ , పాత్రలు రంగస్థలంను పోలి ఉన్నాయి.
దీంతో సుకుమార్ శిష్యుడు గురువులానే తీసి చూపించడాని అందరూ కొనియాడుతున్నారు. కొందరైతే తక్కువ అనుభవంతో ఈ రేంజ్ సినిమాను బాగా హ్యాండిల్ చేశాడని చెప్తూ గురువుకి తగ్గ శిష్యుడు అనే కాంప్లిమెంట్స్ అందిస్తున్నారు. బుచ్చి బాబు లానే శ్రీకాంత్ ఓదెల ‘దసరా’ తో 100 కోట్ల గ్రాస్ కొల్లగొడితే ఇద్దరు టాలెంటెడ్ డైరెక్టర్స్ ను పరిచయం చేసిన ఘనత సుక్కు ఖాతాలో చేరుతుంది.
ఇప్పటికే పాజిటివ్ టాక్ తో దర్శకుడిగా మంచి మార్కులు అందుకుంటున్నాడు శ్రీకాంత్. కమర్షియల్ గా ఎన్ని కోట్లు కొల్లగొడతాడో చూడాలి. త్వరలోనే సుకుమార్ శిష్యుడిగా కాశీ విశాల్ అనే దర్శకుడు కూడా ‘సెల్ఫీష్’ సినిమాతో రాబోతున్నాడు. ఇంకా మరికొందరు సుకుమార్ శిష్యులు డెబ్యూ ఇచ్చే ప్లానింగ్ లో ఉన్నారు.
This post was last modified on March 30, 2023 7:51 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…