కథలు దర్శకులు ఒక హీరో చేతి నుంచి మరొకరికి వెళ్లడం ఇండస్ట్రీలో సర్వ సాధారణం. కాకపోతే మనం తీసుకున్నది సరైన నిర్ణయమా కాదానేది బాక్సాఫీస్ రిజల్ట్ చూశాకే తెలుస్తుంది. ఇవాళ విశ్వక్ సేన్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్ తమ 21వ సినిమాని ప్రకటించింది. ఎక్కువ డీటెయిల్స్ రివీల్ చేయలేదు కానీ లాంచ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడానికి విడుదల చేసిన వీడియోలో సంగీత దర్శకుడిగా యువన్ శంకర్ రాజా పేరొకటి హైలైట్ చేశారు.
నాగ చైతన్య కస్టడీకి తండ్రి ఇళయరాజాతో కలిసి యువన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ వెనుక ఒక ఇంటరెస్టింగ్ సెటప్ ఉంది. దీని దర్శకుడు కృష్ణ చైతన్య. నారా రోహిత్ కున్న అతి కొద్ది హిట్లలో ఒకటైన రౌడీ ఫెలో ఇతను తీసిందే. తర్వాత నితిన్ తో చల్ మోహనరంగా చేశాడు. పవన్ కళ్యాణ్ నిర్మాణంలో త్రివిక్రమ్ పర్యవేక్షణలో రూపొందిన ఆ లవ్ డ్రామా ఆశించిన విజయం సాధించలేదు.
తిరిగి నితిన్ తోనే గుంటూరు బ్యాక్ డ్రాప్ లో పవర్ పేట టైటిల్ తో గ్యాంగ్ స్టర్ డ్రామాని ప్లాన్ చేసుకున్నాడు కృష్ణ చైతన్య. స్క్రిప్ట్ కూడా రెడీ అయ్యింది. రెండు భాగాలుగా నితిన్ ని వివిధ వయసుల్లో చూపించేలా రాసుకున్నాడు. కానీ ముందుకెళ్ళలేదు. తర్వాత చాలా గ్యాప్ వచ్చేసింది. ఎందుకో నితిన్ డ్రాప్ అయ్యాడు.
ఇప్పుడా కథనే విశ్వక్ సేన్ తో కృష్ణచైతన్య ఈ సినిమాగా తీస్తున్నాడని ఇన్ సైడ్ టాక్. వీడియోలో ఉన్న బ్యాక్ గ్రౌండ్ విజువల్స్ చూస్తే పోలికలు సరిపోతున్నాయి. పైగా డార్క్, నెగటివ్ అంటూ హింట్లు కూడా ఇచ్చారు. ఇటీవలే దాస్ కా ధమ్కీతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన విశ్వక్ సేన్ మొత్తానికి పెద్ద బ్యానర్ చేతిలో పడ్డాడు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ చిత్రానికి టైటిల్ ఇంకా లాక్ చేయలేదు. కృష్ణచైతన్యకు తిరిగి త్రివిక్రమ్ క్యాంపే చేయూతనందించడం విశేషం.
This post was last modified on March 29, 2023 4:15 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…