ఇంకో ఇరవై నాలుగు గంటల కంటే తక్కువ వ్యవధిలో దసరా షోలు ప్రారంభం కాబోతున్నాయి. న్యాచురల్ స్టార్ కెరీర్ లో మొట్టమొదటిసారి ఊర మాస్ క్యారెక్టర్ కావడంతో నాని బోలెడు నమ్మకంతో ఉన్నాడు. దీనికి పని చేసిన పన్నెండు మంది అసిస్టెంట్ డైరెక్టర్లు అందరికీ అడ్వాన్స్ చెక్కులు ఇచ్చుకోండని చెప్పడం బట్టి చూస్తే కాన్ఫిడెన్స్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అసలే బాక్సాఫీస్ ఏమంత జోష్ లో లేదు. దాస్ కా ధమ్కీ మొదటి రెండు మూడు రోజుల హడావిడి తప్ప తర్వాత స్లో అయిపోయింది. అందుకే ట్రేడ్ చూపు దసరా మీదే ఉంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 2700కి పైగా స్క్రీన్లలో దసరాని రిలీజ్ చేయబోతున్నారు. థియేట్రికల్ బిజినెస్ 50 కోట్ల దాకా జరిగినట్టు సమాచారం. ఇందులో ఒక్క నైజామ్ నుంచే 13 కోట్ల డీల్స్ జరిగాయట.
ఓవర్సీస్ లో ప్రీమియర్లు పడే సమయానికి అర మిలియన్ సులభంగా దాటొచ్చని అక్కడి విశ్లేషకుల అంచనా. మార్నింగ్ షో టాక్ ఏ మాత్రం పాజిటివ్ గా వచ్చినా ఆపై జరిగే ఊచకోత మాములుగా ఉండదు. ముఖ్యంగా బిసి సెంటర్లలో వసూళ్ల సునామిని ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. హైదరాబాద్ లాంటి ఏ కేంద్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మంచి స్వింగ్ లో ఉన్నాయి.
నానికి ఇది సక్సెస్ అయితే ప్యాన్ ఇండియా మార్కెట్ వచ్చేస్తుంది. ఆపై చేయబోయే సినిమాలకు రెవిన్యూ ప్లస్ రెమ్యునరేషన్ పరంగా పెద్ద ప్లస్ అవుతుంది. పైగా చెప్పుకోదగ్గ పోటీ ఏదీ లేకపోవడం దసరాకు మరో సానుకూలాంశం. ఇంటర్ తో పాటు కొన్ని తరగతుల కీలక పరీక్షలు ముగియడంతో స్టూడెంట్స్ అంతా థియేటర్లకు వస్తే వాళ్లకు ఉన్న ఒకే ఆప్షన్ దసరానే. ఎలాగూ గురువారం వస్తోంది కాబట్టి వీకెండ్ మొత్తం నాలుగు రోజులు ఉంటుంది. బాగుందనే మాట వినడమే బాకీ. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన దసరాలో కీర్తి సురేష్ హీరోయిన్ కాగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు
This post was last modified on March 29, 2023 11:07 am
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…