Adipurush
ఇంకో మూడు రోజుల్లో శ్రీరామనవమి పండగ వస్తోంది. ప్రభాస్ ఆది పురుష్ కు సంబంధించిన కీలక అప్ డేట్ ఏదైనా కొత్త పోస్టర్ లేదా ట్రైలర్ రూపంలో వస్తుందేమోనని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ నిర్మాతల వైపు నుంచి ఎలాంటి సంకేతాలు అందటం లేదు. ఒకవేళ ఏదైనా ఫిక్స్ అయ్యుంటే దాని తాలూకు అప్ డేట్ ని కనీసం నాలుగైదు రోజుల ముందే ఇవ్వడం సహజం.
కానీ టి సిరీస్ మాత్రం నిమ్మకు నీరెత్తనట్టు మౌనంగా ఉంది. దర్శకుడు ఓం రౌత్ నుంచి సైతం సైలెన్స్ తప్ప ఏ సమాధానం లేదు. రిలీజ్ డేట్ ఎంతో దూరంలో లేదు. జస్ట్ రెండున్నర నెలలు అంతే. గత ఏడాది వదిలిన టీజర్ చూశాక నెగటివ్ పబ్లిసిటీ మూటగట్టుకున్న ఆది పురుష్ ప్రమోషన్ పరంగా చాలా అగ్రెసివ్ గా వెళ్లాల్సిన అవసరం చాలా ఉంది. అసలే మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందిన సినిమా.
నటించింది ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్ లే అయినప్పటికీ అధిక శాతం విజువల్ ఎఫెక్ట్స్ మీదే సాగుతుంది. ఎంత రాముడి సెంటిమెంట్ ని హైలైట్ చేస్తున్నా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకోవడానికి అదొక్కటే సరిపోదు. పైగా అందరికీ తెలిసున్న ఒక ఇతిహాస గాథను చూపిస్తున్నప్పుడు చాలా ప్రత్యేకత ఉందనే బలమైన సందేశం ప్రేక్షకుల్లోకి వెళ్ళాలి.
కానీ టి సిరీస్ నిర్లిప్తత వల్ల ఆది పురుష్ మీదున్న ఫోకస్ కాస్తా సలార్ మీదకు వెళ్తోంది.
ఎలాగూ సెప్టెంబర్ లో రావడం ఖాయమని హోంబాలే ఫిలింస్ బల్లగుద్ది చెబుతోంది. కాబట్టి సబ్జెక్టు, స్కేల్, బడ్జెట్, హీరోయిజం పరంగా రెండింట్లో ప్రశాంత్ నీల్ సినిమాకే ఎక్కువ ఎడ్జ్ ఉంది. ఆది పురుష్ పోస్టర్లు, లిరికల్ వీడియోలు, పాటలు, కొత్త ప్రోమోలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ట్రైలర్ లాంచ్, ప్రెస్ మీట్లు, దేశం మొత్తం నగరాల సందర్శనలు ఇలా ఎన్నో ప్లాన్ చేసుకోవాలి. ఈ నత్తనడక వరస చూస్తుంటే ఇంతకీ జూన్ 16 వస్తుందా రాదానే అనుమానం వస్తోంది. ఈ రెండు రోజుల్లో ఏమైనా క్లారిటీ ఇస్తారేమో.
This post was last modified on March 27, 2023 3:46 pm
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…