సీనియర్ హీరోలకు హీరోయిన్లను సెట్ చేయడం ఈ రోజుల్లో చాలా చాలా కష్టమైపోతోంది. 70, 80 దశకాల్లో మాదిరి హీరోలు తమ వయసులో మూడో వంతున్న హీరోయిన్లతో ఏ ఫీలింగ్ లేకుండా రొమాన్స్ చేసే పరిస్థితి లేదిప్పుడు. అలా చేస్తే ప్రేక్షకుల నుంచి వెటకారాలు తప్పవు. సీనియర్ల పక్కన యంగ్‌గా అనిపించే హీరోయిన్లను పెడితే.. అదో రకమైన ఫీలింగ్ వచ్చేస్తోంది జనాలకు.
వాళ్ల కెమిస్ట్రీ, రొమాన్స్ అస్సలు వర్కవుట్ కావడం లేదు. దీంతో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఈ నలుగురికీ హీరోయిన్ల సమస్య తప్పట్లేదు. తన చివరి సినిమా ‘ఎఫ్-3’లో తమన్నాతో జోడీ కట్టాడు వెంకీ. ఇప్పుడు ఆయన ‘హిట్’ డైరెక్టర్ శైలేష్ కొలనుతో ‘సైంధవ్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఓ కథానాయికగా రుహాని శర్మను అనుకుంటున్నట్లు వార్తలొచ్చాయి.
ఐతే ఆమెది ఇందులో సెకండ్ హీరోయిన్ పాత్ర అట. మెయిన్ లీడ్ కోసం వేరే అమ్మాయిని ఎంచుకున్నారు. ఆ అమ్మాయి కన్నడ భామ శ్రద్ధ శ్రీనాథ్ అని సమాచారం. శ్రద్ధ ఈ తరం హీరోయినే అయినా.. విశాల్ లాంటి సీనియర్లతోనూ నటించింది. వెంకీ సరసన ఆమె ఆడ్‌గా ఏమీ అనిపించకపోవచ్చు.
తెలుగులో ఆమె నటిస్తున్న అత్యంత పెద్ద సినిమా ఇదే కానుంది. తెలుగులో ఆమెకు కృష్ణ అండ్ హిజ్ లీల, జెర్సీ లాంటి మంచి సినిమాలున్నాయి. ‘సైంధవ్’లో బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖి విలన్ పాత్ర చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వీడియో చూస్తే ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ లాగా కనిపించింది. వెంకీకిది 75వ సినిమా కావడం విశేషం.
This post was last modified on March 27, 2023 7:25 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ బాలుడు శ్రీ తేజ్ ను టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ పరామర్శించారు.…
ఇటీవల టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ.. ఓ వివాదంలో చిక్కుకున్నాడు. వివిధ ఇండస్ట్రీలకు చెందిన నిర్మాతలు, నటీనటులతో నిర్వహించిన…
గేమ్ చేంజర్ సినిమా విడుదలకు ఇంకో నాలుగు రోజులే సమయం ఉండగా.. టీం మీద పెద్ద బాంబు వేయాలని చూసింది…
ఏకంగా 7500 కోట్ల రూపాయలను మంచి నీళ్ల ప్రాయంలా ఖర్చు చేశారు. మరో వారం రోజుల్లో మహా క్రతువ ను…
https://youtu.be/yCkl2Z3PBs0?si=YrheiH3HjVyB7nwZ పండగ పేరునే టైటిల్ గా పెట్టుకుని బరిలో దిగుతున్న సంక్రాంతికి వస్తున్నాం మీద ముందు ఏమో కానీ పాటలు,…
ప్రతి సంవత్సరం టాలీవుడ్ సంక్రాంతికి ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగుదునమ్మా అంటూ తమిళ డబ్బింగులు రావడం ఏళ్లుగా జరుగుతున్న…