విశ్వక్సేన్.. ఈ తరం కుర్రాళ్లకు అచ్చమైన ప్రతినిధిలా కనిపిస్తున్నాడతను. తక్కువ వయసులోనే హీరోగానే కాక దర్శకుడిగా పేరు సంపాదించిన విశ్వక్‌కు ఫ్యాన్స్‌తో పాటు యాంటీ ఫ్యాన్స్ కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. తన సినిమాల గురించి అతను ఎక్కువ చేసి చెప్పుకునే తీరు.. సినిమా వేడుకల్లో చేసే కామెంట్ల మీద అభ్యంతరాలు వ్యక్తమవుతుంటాయి. కొన్ని వ్యాఖ్యల కారణంగా వ్యతిరేకత పెంచుకున్నాడు.
ఐతే విశ్వక్ అంటే నచ్చొచ్చు.. నచ్చకపోవచ్చు కానీ.. అతణ్ని జనం విస్మరించలేనట్లుగా తనకంటూ ఒక ఫాలోయింగ్ వచ్చేసింది. విశ్వక్ సినిమాలకు టాక్‌తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ వస్తుంటాయి. యూత్‌లో అతడికున్న క్రేజే అందుక్కారణం.
విశ్వక్ కొత్త సినిమా ‘దాస్ కా ధమ్కీ’కి ఏమంత మంచి టాక్ రాలేదు. ఫిబ్రవరిలో మొదలైన అన్ సీజన్ తాలూకు డల్ నెస్ కొనసాగుతున్న టైంలోనే ఈ చిత్రం రిలీజైంది. దీంతో పాటుగా రిలీజైన ‘రంగమార్తాండ’ మంచి టాక్ వచ్చినా ఓపెనింగ్స్ లేవు. కానీ ‘ధమ్కీ’ మాత్రం డివైడ్ టాక్‌తోనే వసూళ్ల మోత మోగించేసింది. తొలి రోజు రూ.8 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్ట్ చేసింది. 2, 3 రోజుల్లో వసూళ్లు డ్రాప్ అయినా.. మరీ ఎక్కువగా కాదు. మూడు రోజుల్లో ఈ సినిమా రూ.15 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందట. విశ్వక్ స్థాయికి ఇది చాలా పెద్ద నంబర్. గత సినిమాలతో పోలిస్తే అతడి మార్కెట్ చాలా పెరిగిందనడానికి ఇది సూచిక.
సినిమా టాక్ గురించి పట్టించుకోకుండా యూత్ విశ్వక్ సినిమాలను చూస్తున్నారన్నది స్పష్టం. యుఎస్‌లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లే రాబడుతోంది. 2 లక్షల డాలర్ల మార్కుకు చేరువగా ఉంది. పుల్ రన్లో ఈ సినిమా సూపర్ హిట్ రేంజిని అందుకునేలా కనిపిస్తోంది.
This post was last modified on March 25, 2023 8:59 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…