Movie News

విడుదల రోజు కలెక్షన్ 15 లక్షలు

చూస్తుంటే బాలీవుడ్ మళ్ళీ క్రాస్ రోడ్స్ లోకి వచ్చినట్టుంది. పఠాన్ సాధించిన వెయ్యి కోట్ల ఆనందం మెల్లగా ఆవిరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కిందా మీద పడి తూ ఝూటి మై మక్కర్ హిట్ అనిపించుకుని వంద కోట్ల మార్క్ దాటేస్తే మిగిలినవి కనీసం పబ్లిసిటీ ఖర్చలు కూడా తేవడం లేదు. నిన్న భీడ్ రిలీజయ్యింది. విలక్షణమైన కథలను ఎంచుకుంటాడని పేరున్న రాజ్ కుమార్ రావు హీరో. భూమి పెడ్నేకర్ హీరోయిన్. కరోనా సమయంలో మొదటిసారి విధించిన లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో దర్శకుడు అనుభవ్ సిన్హా ఈ భీడ్ ని రూపొందించారు.

ఈయనేమి ఆషామాషీ డైరెక్టర్ కాదు. ఆర్టికల్ 15 మూవీ రేపిన సంచలనం అందరికీ గుర్తే. ముల్క్, తప్పడ్ లు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. అనేక్ మాత్రం ఫ్లాప్ అయ్యింది. సరే ఇవన్నీ ఫలితంతో సంబంధం లేకుండా డీసెంట్ నెంబర్లు నమోదు చేసుకున్నవి. కానీ భీడ్ మాత్రం విడుదల రోజు దేశవ్యాప్తంగా అన్ని సెంటర్లలో కలిపి కేవలం 15 లక్షల నెట్ ని వసూలు చేయడం ట్రేడ్ ని నివ్వెరపరిచింది. చాలా చోట్ల కనీసం ఒకరిద్దరు ఆడియన్స్ కూడా లేక షోలు క్యాన్సిల్ చేశారు. చూసిన పది ఇరవై మంది బానే ఉందని చెప్పడం కొసమెరుపు.

సహజత్వం కోసం భీడ్ ని బ్లాక్ అండ్ వైట్ లో తీయడం ప్రేక్షకుల్లో ఆసక్తిని చంపేసింది. ఎంత న్యాచురాలిటీ అయినా మరీ ఇంత సాహసానికి ఒడిగడితే కష్టమే. పైగా పెద్ద స్క్రీన్ మీద అంతసేపు రంగులు లేకుండా ఇంత సీరియస్ డ్రామాని జనం భరించలేరు. అందుకే ఫలితం కూడా రివర్స్ అయ్యింది. కబ్జలాంటి ఇతర బాషల నుంచి డబ్బింగ్ చేసినవి సైతం డిజాస్టర్ కావడంతో నార్త్ బయ్యర్ల కళ్లన్నీ అజయ్ దేవగన్ భోళా మీద ఉన్నాయి. నాని ప్రమోషన్ల పుణ్యమాని దసరాకు కూడా మెల్లగా బజ్ పెరుగుతోంది. ఇక సోమవారం నుంచి భీడ్ పని ముగిసినట్టే.

This post was last modified on March 25, 2023 12:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జ్.. చైనా అద్భుత సృష్టి!

ఈమధ్య AI టెక్నాలజీతో హాట్ టాపిక్ గా నిలిచిన చైనా టారిఫ్ వార్ తో కూడా అమెరికాతో పోటీ పడడం…

2 hours ago

మంచి నిర్మాతకు దెబ్బ మీద దెబ్బ

తెలుగులో ఒకప్పుడు వెలుగు వెలిగిన నిర్మాతలు చాలామంది కనుమరుగైపోయారు. కానీ అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి కొద్ది మంది…

2 hours ago

బాబు మాటతో ఆక్వాకు భరోసా దక్కింది!

అగ్రరాజ్యం అమెరికా కొత్తగా సుంకాల పెంపు కారణంగా ఏపీలో ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం పడినా... కూటమి సర్కారు తీసుకున్న…

3 hours ago

వీడియో : కొడుకుని తీసుకొని ఇంటికి తిరిగి వచ్చిన పవన్ కళ్యాణ్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తో కలిసి…

4 hours ago

తమిళ ప్రేక్షకుల టేస్ట్ ఇదా?

ఒకప్పుడు తమిళ డబ్బింగ్ సినిమాలను చూసి తెలుగులో ఇలాంటి సినిమాలు రావేంటి అని చాలా ఫీలయ్యేవాళ్లు మన ప్రేక్షకులు. అక్కడ ఎన్నో కొత్త…

4 hours ago

రవితేజ-శ్రీలీల.. మళ్లీ ఫైరే

మాస్ రాజా రవితేజకు గత కొన్నేళ్లలో పెద్ద హిట్ అంటే.. ధమాకానే. ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుని కూడా బ్లాక్ బస్టర్…

5 hours ago