ఎట్టకేలకు భీష్మ తర్వాత దర్శకుడు వెంకీ కుడుముల కొత్త సినిమా మొదలైపోయింది. అదే కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ నితిన్ రష్మిక మందన్న జోడిగా దీన్ని తెరకెక్కించబోతున్నారు. ఇవాళ హైదరాబాద్ లో మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ గా ప్రారంభోత్సవం జరిపింది. సంస్థలో పని చేసిన డైరెక్టర్లతో పాటు అతిథులు చాలానే వచ్చారు. నిజానికి వెంకీతో చిరంజీవి హీరోగా డివివి దానయ్య ఎప్పుడో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. కానీ కథ విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో దాన్ని క్యాన్సిల్ చేశారు. దీంతో కుడుముల ఎక్కువ సమయం వేచి చూడాల్సి వచ్చింది.
ఓ కుర్ర దర్శకుడి సమయాన్ని వృధా చేసారనే కామెంట్లు చిరు మీద వచ్చాయి. అయితే దీని వెనుక మెగా వ్యూహం ఉందని ఇన్ సైడ్ టాక్. వాల్తేరు వీరయ్య షూటింగ్ జరుగుతున్న సమయంలో మైత్రితో వెంకీ కుడుములని జట్టు కట్టించిందే మెగాస్టారని వినికిడి. ప్యాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేస్తున్న రశ్మిక మందన్నకు భారీ రెమ్యునరేషన్ ఇచ్చి ఒప్పించడానికి, మంచి డిమాండ్ లో జీవి ప్రకాష్ కుమార్ ని సంగీతం కోసం సెట్ చేయడానికి బడ్జెట్ విషయంలో రాజీ లేకుండా చూడమని చిరునే ఒప్పించారట.
ఈ కారణంగానే నితిన్ మార్కెట్ కొంత డౌన్ లో ఉన్నప్పటికీ దాన్ని పట్టించుకోకుండా నిర్మాతలు నవీన్, రవిలు ఆడిగినంతా ఖర్చు పెట్టడానికి సిద్ధపడినట్టు సమాచారం. ఇది పూర్తయ్యాక అప్పటికి వెంకీ కుడుముల ఏదైనా కొత్త స్టోరీని సిద్ధం చేసుకుని ఒప్పిస్తే చిరుతో సినిమా పట్టాలు ఎక్కేస్తుంది. భోళా శంకర్ తర్వాత చిరంజీవి ఎవరికీ కమిట్మెంట్లు ఇవ్వలేదు. మాట అయితే పెండింగ్ పెట్టారు కానీ పూర్తిగా అయితే రద్దు కాలేదు. ఇవన్నీ క్లియర్ చేయడానికే చిరంజీవి స్పెషల్ గెస్టుగా రావడం కొసమెరుపు.
This post was last modified on March 24, 2023 3:37 pm
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…