సినిమా ప్రమోషన్స్ విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు నాని. తన ఫస్ట్ పాన్ ఇండియా సినిమా దసరా కోసం గట్టిగా ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఇటీవలే ముంబైలో జరిగిన దసరా సాంగ్ లాంచ్ లో రానా గెస్ట్ గా పాల్గొన్నాడు. నార్త్ లో రానాకి ఉన్న క్రేజ్ వాడుకొని దసరా ప్రమోషన్ చేసుకున్నాడు నేచురల్ స్టార్. తాజాగా మరో సీనియర్ హీరో సపోర్ట్ కూడా తీసుకున్నాడు. మాస్ మహారజా రవితేజతో కలిసి నాని ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇద్దరు కలిసి తమ సినిమాల గురించి ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నారు. ఫుల్ వీడియో త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు.
రవితేజతో కలిసి దసరా , రావణాసుర సినిమాల గురించి మాట్లాడిన సంథింగ్ స్పెషల్ వీడియో రానుందని సోషల్ మీడియాలో పంచుకున్నాడు నాని. దాన్ని రీ కోట్ చేసి ధరణి వర్సెస్ రావణాసుర కామెంట్ పెట్టారు రవితేజ. రవితేజ , నాని ఇద్దరు ఎనర్జిటిక్ గా మాట్లాడతారు. ముఖ్యంగా ఇద్దరు స్వయంకృషితో ఈ స్థాయికి చేరుకున్న వారే.
రవితేజ , నాని తమ సినిమాలతో పాటు ఇంకేమైనా మాట్లాడుకున్నారా ? ఈ ఇద్దరు తమ నటన గురించి ఒకరికొకరు ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చుకున్నారు ? అసలు ఈ ఇంటర్వ్యూలో సంథింగ్ అనిపించే టాపిక్స్ ఏం ఉండబోతున్నాయని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టుగా ఒకే ఇంటర్వ్యూతో రెండు సినిమాల ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. మరి ఈ వీడియో దసరా , రావణాసుర కి బజ్ పరంగా ఇంకా హెల్ప్ అవుతుందేమో చూడాలి. మార్చ్ 30న దసరా రిలీజ్ కానుంది. నాని వచ్చిన వారానికి రవితేజ రావణాసుర తో థియేటర్స్ లోకి రానున్నాడు.
This post was last modified on March 23, 2023 5:55 pm
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…