పవన్ కళ్యాణ్ సినిమాల షూటింగుల్లో ముందు ఏది పూర్తవుతుందో ఖచ్చితంగా చెప్పలేకపోయినా కమిటైన వాటికి సంబంధించిన పనులు మాత్రం ఆయా దర్శక నిర్మాతలు చేసుకుంటూ ఉన్నారు. తేరి రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక దర్శకుడు హరీష్ శంకర్ దాని కోసం గబ్బర్ సింగ్ తరహాలో కొన్ని కీలక మార్పులు చేసుకుని స్క్రిప్ట్ సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. కాకపోతే మెయిన్ లైన్ మాత్రం మార్చకుండా కేవలం ట్రీట్ మెంట్ లోనే తేడాలుండేలా జాగ్రత్త పడుతున్నాడట. ఇక ఇద్దరు హీరోయిన్లలో ఆల్రెడీ శ్రీలీల లాక్ అయిన సంగతి తెలిసిందే.
తాజాగా మాళవిక మోహనన్ ని మరో జోడిగా ఎంచుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒరిజినల్ వెర్షన్ ఫ్లాష్ బ్యాక్ లో సమంతా క్యారెక్టర్ చనిపోతుంది. అది జరిగాకే విజయ్ పోలీస్ ఉద్యోగం వదిలేసి వేరే చోట బేకరీ పెట్టుకుని జీవనం సాగిస్తాడు. అక్కడ స్కూల్ టీచర్ గా పని చేస్తున్న అమీ జాక్సన్ అతన్ని ఇష్టపడి కోరుకుంటుంది. క్లైమాక్స్ లో వాళ్ళు కలిసినట్టు పెళ్లైనట్టు చూపించకుండా వదిలేశాడు అట్లీ. ఇక్కడ సామ్ ప్లేసులోనే మాళవికను తీసుకున్నట్టు మీమ్స్ గట్రా వచ్చేశాయి. కానీ మాళవిక మాత్రం ఈ ప్రాజెక్టులో తాను లేనని ట్విట్టర్ లో అఫీషియల్ క్లారిటీ ఇచ్చింది.
మాళవిక మోహనన్ ఆల్రెడీ ప్రభాస్ మారుతీ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అది కూడా టీమ్ అధికారికంగా చెప్పలేదు కానీ షూట్ లో ఉన్న మాట వాస్తవమే. ఇక పవన్ గురించి ప్రచారం ఎలా ఎక్కడి నుంచి మొదలైందో కానీ మొత్తానికి గంటల్లోనే వార్త వైరల్ అయ్యింది. మాములుగా ప్రొడక్షన్ హౌసులు ఖండించే ఇలాంటి న్యూస్ ని స్వయానా హీరోయినే స్పష్టత ఇవ్వడం విశేషం. టాలీవుడ్ డెబ్యూ గురించి ఎగ్జైటింగ్ గా ఉన్నానని పవన్ పట్ల ఎంతో గౌరవముందని అయితే తేరి రీమేక్ లో మాత్రం భాగం కాలేదని సినిమా పేరు ప్రస్తావించకుండానే కుండ బద్దలు కొట్టేసింది.
This post was last modified on March 21, 2023 4:40 pm
వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…
వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…
కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…