ఇంకో రెండు రోజుల్లో తెలుగువారి సాంప్రదాయ నూతన సంవత్సరం ఉగాది వచ్చేస్తోంది. మంగళకరం శుభప్రదంగా భావించే ఈ పర్వదినాన్ని ఇండస్ట్రీ వర్గాలు ఆనందంగా జరుపుకుంటాయి. కొత్త సినిమాల తాలూకు అప్ డేట్స్, పోస్టర్స్, టైటిల్ లాంచ్, షూటింగ్ ఓపెనింగ్స్ ఇలా చాలా తతంగమే ఉంటుంది. అభిమానులకు రోజు పొడవునా ఉక్కిరిబిక్కిరి అయ్యేలా ఉంది. మహేష్ బాబు 28 తాలూకు ఏదైనా అనౌన్స్ మెంట్ ఇవ్వాలని టీమ్ బలంగా ప్రయత్నిస్తోంది. టైటిల్ విషయంలో ఏకాభిప్రాయం రాకపోతే హీరో లుక్ తో కూడిన కొత్త పోస్టర్ లేదా వీడియో విడుదల చేస్తారని టాక్.
బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ పేరుని ప్రకటించే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఏజెంట్ విడుదల ఇంకో ముప్పై అయిదు రోజుల్లోనే ఉన్న నేపథ్యంలో ట్రైలర్ ఎప్పుడు రాబోతోందో వెల్లడించబోతున్నారు. భోళా శంకర్ బృందం నుంచి ఏదో సర్ప్రైజ్ ప్లానింగ్ ఉందని వినికిడి. నాగార్జున బెజవాడ ప్రసన్న కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న విలేజ్ డ్రామాకు సంబంధించిన క్లారిటీని ఆ రోజు ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇస్తారట. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ టీమ్ నుంచి శుభాకాంక్షలు చెబుతూ తారక్ లుక్ ని రివీల్ చేస్తారనే ప్రచారం ఉంది.
వీటిలో చాలా మటుకు వర్కౌట్ అయ్యే సూచనలే ఎక్కువగా ఉన్నాయి. రామ్ చరణ్ పుట్టినరోజుని టార్గెట్ చేసుకున్నారు కాబట్టి శంకర్ తీస్తున్న ప్యాన్ ఇండియా మూవీ తాలూకు టైటిల్ ని పండగనాడు చెప్పకపోయినా ఎప్పుడు చేసేది డేట్ టైంతో పాటు స్పష్టంగా రివీల్ చేస్తారు. ఇవి కాకుండా ప్రారంభోత్సవాలు చాలానే ఉండబోతున్నాయి. థియేట్రికల్ గా దాస్ కా ధమ్కీ, రంగమార్తాండలు బరిలో దిగుతున్న నేపథ్యంలో కొన్ని వారాలుగా చాలా డ్రైగా ఉన్న బాక్సాఫీస్ ని ఇవి ఆదుకోవాలని బయ్యర్లు ఎదురు చూస్తున్నారు. నెలాఖరుకి నాని దసరాతో పాటు పిల్లల సెలవులూ మొదలవుతున్నాయి.