నేచురల్ స్టార్ నాని కెరీర్‌కు చాలా కీలకమైన సినిమా.. దసరా. ఇప్పటిదాకా కెరీర్లో ఎన్నడూ చేయనంత ఊర మాస్ పాత్రను నాని చేశాడిందులో. ఈ పాత్ర నానికి మేకోవర్ మాత్రమే కాదు.. తన కెరీర్‌ను ఇంకో స్థాయికి తీసుకెళ్లేది అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. వేసవి కానుకగా ఈ నెల 30నే ‘దసరా’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ సినిమాను నాని చాలా అగ్రెసివ్‌గా ప్రమోట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.
ఈ సందర్భంగా ‘దసరా’ షూటింగ్ టైంలో ఎదురైన భయానక అనుభవం గురించి అతను మాట్లాడడు. ఈ సినిమా వల్ల తాను రెండు నెలలు పాటు విపరీతంగా భయపడ్డానని.. నిద్ర లేని రాత్రులు గడిపానని అతను వెల్లడించాడు.
“దసరా సినిమా సింగరేణి బొగ్గు నేపథ్యంలో నడుస్తుంది. ఇందులో డంపర్ ట్రక్ బొగ్గును తీసుకెళ్లి డంప్ చేసే సన్నివేశం చేశాం. ఈ సీన్లో డంపర్ ట్రక్‌లోంచి కింద పడితే ఆ బొగ్గు నాపై పడాలి. ఇందుకోసం సింథటిక్ బొగ్గును వాడాం. అది మొత్తం దుమ్ముతో కూడి ఉంటుంది. ఆ సీన్లో నేను డంపర్ నుంచి కింద పడిపోతాను. సింథటిక్ కోల్స్ కింది నుంచి నన్ను పైకి లాగడానికి కొంత సమయం పడుతుంది. ఆ గ్యాప్‌లో నేను గాలి పీల్చకూడదు. పీలిస్తే డస్ట్ అంతా లోపలికి వెళ్లిపోతుంది. ఈ సీన్ షూటింగ్ చాలా రోజులు చేశాం.
ఐతే ఆ తర్వాత కూడా.. నేను డంప్‌లోంచి బొగ్గుతో పాటు కింద పడటం.. బొగ్గు నాపై పడటం.. నన్ను పైకి లాగడం.. ఇవన్నీ గుర్తుకొచ్చేవి. అవి గుర్తుకొచ్చినపుడల్లా లోపల ఏదో ఇబ్బందిగా అనిపించేది. ఈ క్రమంలో నాకు తెలియకుండానే నేను శ్వాస ఆపడం చేసేవాడిని.. దాన్నుంచి బయటపడటానికి నాకు చాలా టైం పట్టింది. దీని వల్ల రెండు నెలల పాటు సరిగా నిద్ర కూడా పోలేదు” అని నాని తెలిపాడు. ఇక ఈ సినిమాలో సన్నివేశాల్లో సహజత్వం కోసం తాను మద్యం తాగి నటించినట్లు నాని వెల్లడించడం విశేషం.
This post was last modified on March 17, 2023 11:49 am
మాములుగా స్టార్ హీరోల విషయంలో కంబ్యాక్, సెకండ్ ఇన్నింగ్స్ పదాలు సాధారణంగా వినిపిస్తూ ఉంటాయి. ఏదైనా గ్యాప్ వచ్చినప్పుడు లేదా…
బాక్సాఫీస్ కు ఈ ఏడాది సంక్రాంతి, ఉగాది తర్వాత అత్యంత కీలకమైన సీజన్ ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం. లాంగ్…
నితిన్ లేటెస్ట్ రిలీజ్ రాబిన్ హుడ్ బాక్సాఫీస్ ఫలితం చేదుగా వచ్చేసింది. ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లు చేసినా, డేవిడ్ వార్నర్…
టాలీవుడ్ శ్రీవల్లిగా అభిమానులను సంపాదించుకున్న రష్మిక మందన్న మూడు బ్లాక్ బస్టర్లు యానిమల్, పుష్ప 2 ది రూల్, ఛావాలతో…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ ఆదివారం సాగర నగరం విశాఖపట్టణం…
ఏపీ వాణిజ్య రాజధానిగా పేరుగాంచిన విశాఖపట్టణం… గతంలో ఎలా ఉందో, భవిష్యత్తులోనూ అలాగే ఉండనుంది. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం…