తమిళ సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప దర్శకుల్లో గౌతమ్ మీనన్ ఒకడు. ‘కాక్క కాక్క’ మొదలుకుని గత ఏడాది రిలీజైన ‘ముత్తు’ వరకు అతను చాలా క్లాసిక్సే అందించాడు. యాక్షన్ థ్రిల్లర్లను ఎంత పకడ్డందీగా తీస్తాడో.. ప్రేమకథా చిత్రాలను అంత హృద్యంగా తీర్చిదిద్దుతాడు గౌతమ్. 20 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్నప్పటికీ.. గౌతమ్ ఎంత ట్రెండీగా ఉన్నాడో ‘ముత్తు’ సినిమా చూస్తే అర్థమవుతుంది.
ఐతే ఈ ఏస్ డైరెక్టర్ దర్శకుడిగా ఒక స్థాయి అందుకున్నాక అవసరం లేని సాహసాలు చేశాడు. నిర్మాతగా మారి చేతులు కాల్చుకున్నాడు. ఈ క్రమంలో ఫైనాన్షియర్లతో గొడవలు తలెత్తి అతడి సినిమాలు వరుసగా అర్ధంతరంగా ఆగిపోవడం మొదలైంది. ధనుష్ హీరోగా తీసిన ‘తూటా’ సినిమా కొన్నేళ్ల పాటు మరుగున పడి మూడేళ్ల కిందట అతి కష్టం మీద విడుదలైంది. ‘నరకాసురన్’ అనే గౌతమ్ ప్రొడ్యూస్ చేసిన సినిమా అసలు విడుదలకే నోచుకోకుండా ఆగిపోయింది.
దీంతో పాటు విక్రమ్ హీరోగా గౌతమ్ చాలా ఏళ్ల కిందట మొదలుపెట్టిన ‘ధృవనక్షత్రం’ కూడా పక్కన పడి ఉంది. షూటింగ్ చివరి దశలో ఈ సినిమా ఆగిపోయింది. విక్రమ్ సహా అందులో నటిస్తున్న ఆర్టిస్టులు దీనిపై ఆశలు వదులుకుని వేరే ప్రాజెక్టుల్లోకి వెళ్లిపోయారు. ఐతే ఎట్టకేలకు ఈ సినిమాను బయటికి తీసే ప్రయత్నం జరుగుతోంది. ఇటీవలే విక్రమ్, ఇతర ఆర్టిస్టులను రప్పించి బ్యాలెన్స్ పార్ట్ అంతా షూట్ చేసేశాడు. ‘ధృవ నక్షత్రం’ ఒక కీలక పాత్ర చేస్తున్న బాలీవుడ్ నటుడు బెనెడిక్ట్ గారెట్.. ట్విట్టర్లో ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ సినిమా షూట్ మొత్తం పూర్తయిందన్నాడు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసి వేసవిలో సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారట. మే 19కి రిలీజ్ అనుకుంటున్నట్లు సమాచారం.
ఏ అడ్డంకులూ లేకపోతే ఆ రోజు సినిమా థియేటర్లోకి దిగొచ్చు. కాక్క కాక్క, ఎన్నై అరిందాల్ తరహా ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో తెలుగమ్మాయి రీతు వర్మ కథానాయికగా నటించగా.. సిమ్రాన్ ఓ కీలక పాత్ర చేసింది.
This post was last modified on March 16, 2023 10:12 pm
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…