Movie News

బ్రహ్మాండంగా పనిచేస్తున్న నెగిటివ్ పబ్లిసిటీ

దగ్గుబాటి వెంకటేష్ రానా మొదటిసారి ఆన్ స్క్రీన్ కాంబినేషన్ రానా నాయుడు వెబ్ సిరీస్ సోషల్ మీడియా వేదికగా ఎంత రచ్చ చేసిందో చూశాం. ముఖ్యంగా అందులో అడల్ట్ కంటెంట్, బూతు డైలాగుల మీద ఓ రేంజ్ లో విమర్శలు వచ్చి పడ్డాయి. అయినా ఆడియన్స్ లెక్క చేయడం లేదు. దెబ్బకు వారం తిరక్కుండానే పది లక్షల వ్యూస్ అవర్స్ కు దగ్గరగా వెళ్లడం నెట్ ఫ్లిక్స్ ని సైతం ఆశ్చర్యంలో పడేసింది. రెస్పాన్స్ ఊహించిందే అయినా మరీ ఈ స్థాయిలో కాదని డిజిటల్ వర్గాల కథనం. ప్రస్తుతానికి ఇండియాతో పాటు కొన్ని ప్రధాన దేశాల్లోనూ రానా నాయుడే టాప్ 1లో ఉన్నాడు.

ఇక్కడ నెగటివ్ పబ్లిసిటీనే ఎక్కువగా పని చేసినట్టు కనిపిస్తోంది. ఫేస్ బుక్ పోస్టులు, ట్వీట్లు చూసిన సగటు జనాలు అవునా ఇందులో వెంకటేష్ మరీ అంత పచ్చి కంటెంట్ లో నటించాడా అని అదే పనిగా చూడటం మొదలుపెడుతున్నారు. రెగ్యులర్ గా ఫారిన్ సిరీస్ చూసే అలవాటున్న వాళ్లకు అదేమీ జుగుప్సగా అనిపించలేదు కానీ ఈ వ్యవహారాలకు దూరంగా ఉండే మాములు జనాలు మాత్రం ఇలాంటివి చేయకపోతేనే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా రానా నాయుడుకి ఫ్యాన్స్ తో పాటు యూత్ మద్దతు బాగా దొరికిందని ట్రెండ్ రుజువు చేసింది.

దీని ప్రమోషన్ మీద రానా ఎంత శ్రద్ధ వహించాడంటే తాత్కాలికంగా రామానాయుడు స్టూడియోస్ బోర్డుని రానా నాయుడుగా మార్పించి దాన్ని గ్లో సైన్ బోర్డు రూపంలో ఫిలిం నగర్ రోడ్డు మీద వెళ్ళేవాళ్ళకు హైలైట్ అయ్యేలా చేయించాడు. అంతేకాదు టైం దొరికినప్పుడు రానా నాయుడు గురించి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసిన వాళ్లకు సమాధానం చెబుతూ తన వంతుగా పబ్లిసిటీలో భాగమవుతున్నాడు. దీని సక్సెస్ ని ఒక ఈవెంట్ రూపంలో ప్లాన్ చేయాలని నెట్ ఫ్లిక్స్ ప్లాన్ చేస్తోంది. దానికి వెంకటేష్ అంగీకారం రావాల్సి ఉందని టాక్. తన మీద కామెంట్స్ కి కౌంటర్ ఇవ్వడానికైనా వెంకీ ఎస్ అంటారేమో.

This post was last modified on March 16, 2023 2:08 pm

Share

Recent Posts

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

23 minutes ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

2 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

5 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

7 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

12 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

13 hours ago