సాహో, రాధే శ్యామ్ వరసగా నిరాశపరిచాక అభిమానులకు నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్న ప్రభాస్ శరవేగంగా సినిమాలు చేస్తూ షూటింగులే ప్రపంచంగా తిరుగుతున్నాడు. నిర్మాతలు ప్రకటించిన ప్రకారమే రిలీజ్ డేట్లు కనక మారకపోతే కేవలం ఎనిమిది నెలల్లో మూడు ప్యాన్ ఇండియా మూవీస్ చూసుకోవచ్చు. ఆది పురుష్ జూన్ నుంచి వెనుకడుగు వేసేది ఉండదని దర్శకుడు ఓం రౌత్ నొక్కి వక్కాణిస్తున్నాడు. నిర్మాణ సంస్థ టి సిరీస్ ఆల్రెడీ హండ్రెడ్ డేస్ కౌంట్ డౌన్ అంటూ ప్రమోషన్లు మొదలుపెట్టింది. ఇంకొద్ది రోజుల్లో పీక్స్ కు తీసుకెళ్లనున్నారు.
ఇక సలార్ విషయానికి వస్తే దాదాపు డెబ్భై శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ యాక్షన్ డ్రామాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్నాయి. అందులో మొదటిది సలార్ రెండు భాగాలుగా రావడం దాదాపు లాంఛనమే. అఫీషియల్ గా చెప్పలేదు కానీ టీజర్ లేదా ట్రైలర్ లాంచ్ రోజు ఇది అనౌన్స్ చేయొచ్చు. కానీ సీక్వెల్ షూటింగ్ సమాంతరంగా జరుగుతోందా లేక గ్యాప్ ఇచ్చి కెజిఎఫ్ 2 లాగా సెపరేట్ గా తీస్తారా అనేది ఇంకా తెలియలేదు. ఇంకో కీలకమైన లీక్ ఏంటంటే డార్లింగ్ డ్యూయల్ రోల్ చేయడం.
ప్రధాన పాత్ర పేరు సలార్ అయితే కొడుకు క్యారెక్టర్ కి దేవా అని ఫిక్స్ చేశారట. ఒకరికి జగపతిబాబు విలన్ అయితే ఇంకొకరితో పృథ్విరాజ్ సుకుమారన్ తలపడతాడు. అయితే బాహుబలి లాగా ఇద్దరు ప్రభాస్ లు ఒకే ఫ్రేమ్ లో కలుసుకునే అవకాశం ఉండదా లేక రివెంజ్ డ్రామా టైప్ ట్విస్టు పెట్టి జాయింట్ గా చూపించే ప్లాన్ ఏమైనా దర్శకుడు ప్రశాంత్ నీల్ చేశాడేమో ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంచుతున్నారు. ఆది పురుష్ ఎలాగూ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందుతున్న మూవీ కాబట్టి జనాల ఆసక్తి అంచనాలు సలార్ మీదే ఎక్కువగా ఉన్న మాట వాస్తవం
This post was last modified on March 16, 2023 1:51 pm
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…
ప్రస్తుత రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీలదే రాజ్యం. విపక్ష పార్టీలకు కష్ట కాలం. అప్పటిదాకా అధికారంలో ఉండి… ఎన్నికల్లో ఓడిపోయి…
శంకర్.. ఒకప్పుడు ఈ పేరు చూసి కోట్లమంది కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవారు. హీరోలు కథ వినకుండానే సినిమా ఒప్పేసుకునేవారు.…