Movie News

ప్ర‌ధాని చెప్పిందే స్పీల్ బ‌ర్గ్ చెప్పాడు


ఆర్ఆర్ఆర్ సినిమా విడుద‌లై ఏడాది కావ‌స్తున్నా.. ఇప్ప‌టికీ ఆ చిత్రం ఇండియాలోనే కాక ప్ర‌పంచ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అవుతూ వ‌స్తుండ‌టం విశేషమే. అందులోనూ ఇటీవ‌లే ఈ సినిమాలోని నాటు నాటు పాట‌కు ఆస్కార్ అవార్డు రావ‌డంతో ఎక్క‌డా చూసినా ఈ చిత్రం గురించే చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌న సినిమా గురించి ప్ర‌పంచ‌మంతా ఇలా మాట్లాడుకుంటుండ‌టం విశేష‌మే. ఈ సంద‌ర్భంలోనే ఆర్ఆర్ఆర్ క‌థా ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఓ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని వెల్ల‌డించారు.

గ‌త ఏడాది ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో స‌మావేశ‌మైన సంద‌ర్భంగా ఆయ‌న ఏం చెప్పారో.. స‌రిగ్గా అదే విష‌యాన్ని త‌న కొడుకు, ఆర్ఆర్ఆర్ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ద‌గ్గ‌ర హాలీవుడ్ లెజెండ‌రీ డైరెక్ట‌ర్ స్టీఫెన్ స్పీల్‌బ‌ర్గ్ కూడా చెప్పిన‌ట్లు విజ‌యేంద్ర ప్ర‌సాద్ వెల్ల‌డించ‌డం విశేషం.

నేను కొంత కాలం కింద‌ట ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ గారిని క‌లిశాను. నాతో ఆయ‌న నాలుగు నిమిషాలు మాట్లాడ‌తారేమో అనుకున్నా. కానీ మా స‌మావేశం 40 నిమిషాలు సాగింది. ఆ న‌ల‌భై నిమిషాలు.. ప్ర‌పంచం మొత్తం మ‌న దేశం వైపు ఎలా చూడాలి అనే దాని గురించే చ‌ర్చించుకున్నాం. మోడీ గారి విజ‌న్‌కు నేను ఆశ్చర్య‌పోయా. మ‌న దేశ సంస్కృతి చాలా గొప్ప‌ద‌ని.. దాన్ని ప్ర‌పంచానికి చాటేలా కృషి చేయాల‌ని ఆయ‌న అన్నారు.

ఇక రాజ‌మౌళి.. ఆర్ఆర్ఆర్ స్క్రీనింగ్ కోసం ఆమెరికాకు వెళ్లిన‌పుడు స్పీల్‌బ‌ర్గ్‌ను క‌ల‌వ‌గా.. స‌రిగ్గా ఆయ‌న కూడా ఇదే విష‌యం చెప్పిన‌ట్లు నాతో అన్నాడు. భార‌త దేశ సంస్కృతి ఉట్టిప‌డేలా.. ప్ర‌పంచానికి ఇక్క‌డి సంస్కృతి గురించి తెలిసేలా సినిమాలు తీయాల‌ని రాజ‌మౌళికి స్పీల్‌బ‌ర్గ్ సూచించిన‌ట్లు తెలిసింది. మోడీ నాకు చెప్పిన విష‌య‌మే.. స్పీల్‌బ‌ర్గ్ రాజ‌మౌళికి చెప్ప‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింది అని విజ‌యేంద్ర ప్ర‌సాద్ అన్నారు. ఆర్ఆర్ఆర్ విజ‌యం వెనుక త‌మ కుటుంబానికి చెందిన మూడు త‌రాల వారి కృషి ఉండ‌టం త‌న‌కెంతో ఆనందాన్ని క‌లిగించే విష‌య‌మ‌ని విజ‌యేంద్ర ఈ సంద‌ర్భంగా చెప్పారు.

This post was last modified on March 16, 2023 10:08 am

Share

Recent Posts

నాని నిర్ణయం రిస్క్ అవుతుందా

ప్యారడైజ్ ఫలితం తర్వాత నాని కొంచెం డిఫెన్స్ లో పడిన మాట వాస్తవం. పదే పదే మాస్ ని లక్ష్యంగా…

55 minutes ago

అదుర్స్ కొనసాగింపు కుదరదని తెలిసినా

కొన్ని సినిమాలకు కొనసాగింపులు సులభం కాదు. ఏదో జనాల్లో క్రేజ్ ఉంది కదాని, సోషల్ మీడియాలో హైప్ ఉంది లెమ్మని…

2 hours ago

సెన్సార్ బోర్డుపై కుండబద్దలు కొట్టిన కోన

సినిమాల సెన్సార్షిప్‌ విషయంలో పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఈ మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో…

3 hours ago

మోదీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం

వందేళ్ల క్రితం సైమన్ ను రక్షించడానికి ప్రయత్నించిన బ్రిటీష్ ప్రభుత్వం కుప్పకూలిపోయిందని, ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ ను రక్షించాలని ప్రయత్నం…

3 hours ago

మత రాజకీయమే మార్గమా సాయిరెడ్డి?

వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి సగటు రాజకీయ నాయకుడి నుంచి మతపరమైన రాజకీయాలు చేసి…

4 hours ago

మెగాస్టార్ లిస్టులో వద్దనుకున్న పేరుందా

కాకా జనవరిలో సంక్రాంతి పండక్కు వచ్చేస్తుంది. తక్కువ గ్యాప్ లో విశ్వంభర దిగుతుంది. తర్వాత ఎవరితో సినిమా ఉంటుందనేది చిరంజీవి…

5 hours ago