మొన్న జరిగిన ఆస్కార్ వేడుకలో స్టేజి మీద ఫారిన్ డాన్సర్లు నాటు నాటుకి లైవ్ లో డాన్స్ చేయడం గొప్ప అనుభూతినిచ్చింది కానీ దానికి బదులు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు చేసుంటే అదో చిరస్మరణీయ ఘట్టంగా మిగిలిపోయేదని ఇద్దరి అభిమానులు బాగా ఫీలయ్యారు. అందులో నిజం లేకపోలేదు. ఎందుకంటే అలాంటి అంతర్జాతీయ వేదిక మీద నృత్యం చేయడమంటే అదో అరుదైన దృశ్యంగా చిరకాలం నిలిచిపోయేది. ప్రాక్టీస్ లేకపోవడం ఒక కారణమని తారక్ చెప్పాడు కానీ తెరవెనుక ఏం జరిగిందననేది అకాడెమి అఫీషియల్ వెబ్ సైట్ లో వివరణ ఇచ్చింది.
నిజానికి ఆస్కార్ కమిటీ తారక్, చరణ్ ల లైవ్ నే అడిగింది. కానీ ఫిబ్రవరి మధ్యలో తమకున్న వృత్తిపరమైన కమిట్ మెంట్ల వల్ల అలా చేయలేమని, పైగా రిహార్సల్ చేయడానికి తగినంత సమయం లేదని ఇద్దరి నుంచి బదులు వచ్చింది. పైగా ఆ పాట తాలూకు వర్క్ షాప్ ని రెండు నెలలు నిర్వహించి మరో పదిహేను రోజులు చిత్రీకరించడానికి తీసుకున్నారు. అలాంటిది కొన్ని కోట్ల మంది చూస్తున్న కెమెరాల ముందు పర్ఫెక్ట్ గా రావాలంటే సాధన సరిపోదని వాళ్ళ ఉద్దేశం. ఈ కారణంగానే నాటు నాటుని మరోసారి ప్రత్యక్షంగా చూసే అవకాశం ఫ్యాన్స్ కోల్పోయినట్టయ్యింది.
మనం చూసిన విదేశీ డాన్సర్ల పెర్ఫార్మన్స్ కి ముందు లాస్ యాంజిల్స్ లో 18 గంటల పాటు నిపుణున ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పించారు. 90 నిమిషాల కెమెరా బ్లాకింగ్ ని వాడి ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూసుకున్నారు. ఇంత జాగ్రత్త తీసుకోవడం వల్లే ఎలాంటి పొరపాట్లకు అవకాశం దక్కలేదు. ఒకవేళ నాటు నాటుకి అవార్డు ఖాయమని ఏ నవంబర్ లోనో తెలిసి ఉంటే ముందస్తుగా సన్నద్ధమవ్వడానికి ఛాన్స్ ఉండేది. కానీ నామినేషన్ల స్టేజిలోనే విజేత ఎవరని తెలిసే ఆస్కారం లేకపోవడంతో ఇలా సర్దుకోక తప్పలేదు. టైం ఉండింటే మాత్రం అద్భుతమే జరిగేది.
This post was last modified on March 15, 2023 12:00 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…