తొలిసారి క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో ఛాన్స్


కొంచెం వైవిధ్యం ఉన్న‌, కంటెంట్ బేస్డ్ సినిమాల్లో న‌టిస్తూ.. ఒక ముద్ర వేయించుకున్న హీరోయిన్ల‌కు క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో అవ‌కాశం రావ‌డం క‌ష్ట‌మే. ఒక అభిరుచితో సినిమాలు చేసే ఈ త‌ర‌హా హీరోయిన్లు.. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో న‌టించ‌డానికి పెద్ద‌గా ఆస‌క్తి కూడా చూపించరు. మ‌ల‌యాళ భామ మాళ‌విక నాయ‌ర్ ఈ కోవ‌కే చెందుతుంది. కెరీర్ ఆరంభం నుంచి ఆమె కంటెంట్ బేస్డ్, డిఫ‌రెంట్ సినిమాలే చేస్తోంది. త‌న పాత్ర‌కు ప్రాధాన్యం ఉన్న సినిమాలే ఎంచుకుంటోంది. ఎ

వ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం నుంచి ఫ‌లానా అబ్బాయి ఫ‌లానా అమ్మాయి వ‌ర‌కు ఆమె ప్ర‌యాణం వైవిధ్యంగానే సాగుతూ వ‌స్తోంది. ఐతే ఇప్పుడు ఆమె తొలిసారిగా ఒక క‌మ‌ర్షియల్ సినిమాలో న‌టించ‌బోతోంది. ఆ సినిమానే.. డెవిల్.

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా న‌వీన్ మేడారం రూపొందిస్తున్న సినిమా డెవిల్. సైలెంటుగా సెట్స్ మీదికి వెళ్లి చ‌డీచ‌ప్పుడు లేకుండా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం పీరియ‌డ్ క‌థ‌తో తెర‌కెక్కుతోంది. క‌ళ్యాణ్ రామ్ ఇందులో నెవ‌ర్ బిఫోర్ అన‌ద‌గ్గ పాత్ర చేస్తున్నాడు. ఈ చిత్రంలో క‌థానాయిక ఎవ‌ర‌న్న‌ది ఇప్ప‌టిదాకా వెల్ల‌డి కాలేదు. త‌న కొత్త చిత్రం ఫ‌లానా అబ్బాయి ఫ‌లానా అమ్మాయి ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా మీఇయాను క‌లిసిన సంద‌ర్భంగా మాళ‌విక.. త‌నే ఈ చిత్ర క‌థానాయిక‌న‌ని బ‌య‌ట పెట్టింది.

మాళ‌విక లాంటి హీరోయిన్ల‌ను క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో రొటీన్ రోల్స్‌లో చూడ‌టం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మ‌రి డెవిల్‌లో ఆమె క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుందో చూడాలి. ప్రామిసింగ్‌గా క‌నిపిస్తున్న ఫలానా అబ్బాయి ఫ‌లానా అమ్మాయితో మ‌రో హిట్ ఖాతాలో వేసుకునేలా క‌నిపిస్తున్న మాళ‌విక‌.. వేస‌విలో అన్నీ మంచి శ‌కున‌ములే చిత్రంతో ప‌ల‌క‌రించ‌బోతోంది.