తమన్నా పెళ్లి గురించి వార్తలు ఈనాటివి కావు. కొన్నేళ్ల ముందు నుంచే దాని గురించి చర్చ జరుగుతోంది. ఎవరో ఒక వ్యాపారవేత్తను ఆమె పెళ్లాడబోతున్నట్లు ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది. ఇంకా ఇలాంటి వార్తలు మరికొన్ని హల్‌చల్ చేశాయి. కానీ ఇప్పుడు తమన్నా ప్రేమాయణం.. పెళ్లి గురించి కొంచెం గట్టిగానే వార్తలు వస్తున్నాయి. అవి ఆధారం లేకుండా ఏమీ ప్రచారంలోకి రాలేదు. కొంత కాలం నుంచి బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ఆమె ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఒక సినిమా కోసం వీళ్లిద్దరూ జట్టు కట్టగా.. అప్పట్నుంచి బయట కూడా చాలా సన్నిహితంగా కనిపిస్తున్నారు. తమ ప్రేమాయణం గురించి వస్తున్న వార్తలను ఇటు తమన్నా, అటు విజయ్ పూర్తిగా ఖండించట్లేదు. అలా అని ధ్రువీకరించనూ లేదు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ టాపిక్ మీద తమన్నా స్పందించింది. ఆమె ఎప్పట్లాగే విజయ్‌తో ఎఫైర్ విషయాన్ని ఖండించలేదు. అలాగే కన్ఫమ్ కూడా చేయలేదు. “అసలు నా పెళ్లి విషయంలో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. హీరోయిన్లు నిజంగా పెళ్లి చేసుకోవడానికి ముందు వారికి చాలా సార్లు పెళ్లి చేసేస్తారు. ప్రతి శుక్రవారం కూడా మాకు పెళ్లి చేసేస్తుంటారు. డాక్టర్ అని, బిజినెస్‌మ్యాన్ అని, యాక్టర్ అని.. ఇలా రకరకాల వ్యక్తులతో మా పెళ్లి జరిపిస్తుంటారు. నాకు చాలాసార్లు ఇప్పటికే పెళ్లి జరిగింది కాబట్టి.. నిజంగా నాకు పెళ్లి జరిగినపుడు జనాల్లో ఏమైనా ఎగ్జైట్మెంట్ ఉంటుందో లేదో తెలియదు. దాన్ని కూడా ఒక రూమర్ అనుకుంటారేమో. ఏం జరుగుతుందో చూద్దాం” అంటూ విజయ్‌తో ప్రేమాయణం గురించి సమాధానం చెప్పకుండా దాట వేసింది తమ్మూ.
This post was last modified on March 14, 2023 4:41 pm
ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…
వైసీపీ పాలనలో ప్రజాధనం నీళ్లలా ఖర్చుపెట్టారని, జనం సొమ్మును దుబారా చేయడంలో మాజీ సీఎం జగన్ ఏ అవకాశం వదలలేదని…
మాములుగా ప్రభాస్ కొత్త సినిమా వస్తోందంటే ఆ యుఫోరియా వేరే లెవెల్ లో ఉంటుంది. సలార్ కు పెద్దగా ప్రమోషన్లు…
రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించేందుకు వ్యతిరేకంగా వైసీపీ నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కోటి…
బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…
సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…