అంచనాలు నిజమయ్యాయి. ఆశలు ఫలించాయి. భారతీయ ప్రేక్షకులనే కాక ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందిని ఊపేసిన ‘నాటు నాటు’ పాటకు ‘ఆస్కార్’ పురస్కారం దక్కింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అకాడమీ అవార్డును సొంతం చేసుకుంది ‘నాటు నాటు’. ఒక తెలుగు పాటకు ఆస్కార్ వేదిక మీద గౌరవం దక్కడం అంటే చిన్న విషయం కాదు.
మన పాటను ఆస్కార్ వేదిక మీద ప్రదర్శించడం.. మన సంగీత దర్శకుడు, గేయ రచయిత కలిసి అకాడమీ పురస్కారాలను అందుకోవడం.. ఇదంతా కలలోనూ ఊహించలేని విషయం. ఇదంతా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వల్లే సాధ్యమైంది. ఈ పాట ఇంత గొప్ప ఆదరణ సంపాదించుకుని ఆస్కార్ పురస్కారం అందుకోవడంలో చాలామంది పాత్ర ఉంది. ఐతే మేజర్ క్రెడిట్ ఇవ్వాల్సిన వ్యక్తి ఆస్కార్ వేదికలో లేకపోవడం మాత్రం విచారించాల్సిన విషయమే.
ఆస్కార్ అకాడమీ నిబంధనల ప్రకారం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ పురస్కారాన్ని ఆ పాటను కంపోజ్ చేసిన సంగీత దర్శకుడితో పాటు గేయ రచయితలకు అవార్డును అందజేస్తారు. కానీ ‘నాటు నాటు’ అంత పెద్ద హిట్ అయి ప్రపంచవ్యాప్తంగా కోట్లమందిని ఊపేయడానికి ప్రధాన కారణం మాత్రం అందులోని అద్భుతమైన స్టెప్పులే. ఆ పాట చూసి అందరూ మైమరిచిపోయింది ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నమ్మశక్యం కాని సింక్‌లో, మెరుపు వేగంతో, కళ్లు చెదిరే గ్రేస్‌తో వేసిన స్టెప్పులే. ఆ పాటలో వారి స్టెప్పులు చూసి నోరెళ్లబెట్టని వారు లేరు. కీ
రవాణి సూపర్ బీట్ ఉన్న ట్యూన్ ఇచ్చినా.. చంద్రబోస్ చక్కటి సాహిత్యం సమకూర్చినా.. గాయకులు కూడా బాగా పాడినా.. దృశ్యపరంగానే ఈ పాట ఎక్కువమందికి నచ్చి అంత పెద్ద హిట్ అయింది. ఆ పాటను రాజమౌళి అద్భుతంగా చిత్రీకరించాడు.. తారక్, చరణ్ అద్భుతంగా డ్యాన్స్ చేశారు. కానీ ఆ పాటకు అంత అద్భుతంగా నృత్యరీతులు సమకూర్చి.. తారక్, చరణ్‌లతో అంత బాగా డ్యాన్స్ చేయించింది ప్రేమ్ రక్షితే. ఆస్కార్ వాళ్లు తమ నిబంధనల ప్రకారం కీరవాణి, చంద్రబోస్‌లను మాత్రమే గౌరవించి ఉండొచ్చు కానీ.. ప్రేక్షకుల దృష్టిలో మాత్రం వీరితో పాటు ప్రేమ్ రక్షిత్ కూడా ఆస్కార్ అందుకున్నట్లే.
This post was last modified on March 13, 2023 2:34 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…