సోనూ సూద్ తెరమీదే విలన్.. నిజ జీవితంలో హీరో.. ఇప్పుడు అందరినీ నోటా వినిపిస్తున్న మాట ఇది. కరోనా ధాటికి అల్లాడుతున్న అభాగ్యులకు అతను చేసిన సాయం, సేవ గురించి ఎంత చెప్పినా తక్కువే. ముందు వలస కార్మికుల్ని ఆదుకున్నాడు.
ఇప్పుడు లాక్ డౌన్ వల్ల ఉపాధి, ఆదాయం కోల్పోయి అవస్థలు పడుతున్న వివిధ వర్గాల వ్యక్తుల గురించి సోషల్ మీడియాలో తెలుసుకుని సాయం చేస్తున్నాడు. ఇలా ఎంతమందికి సాయం చేస్తాడు.. దీనికి ముగింపు ఎక్కడ.. సోనూ దగ్గర ఎంత డబ్బుంది.. అన్న సందేహాల సంగతి పక్కన పెడితే.. ఈ సేవతో అతను ఆత్మ సంతృప్తి పొందుతున్నాడన్నది స్పష్టం. ఈ క్రమంలో జనాల్లో సోనూకు రోజు రోజుకూ అభిమానం పెరిగిపోతోంది. అతడి మీద తమ ప్రేమను రకరకాల మార్గాల్లో వ్యక్తం చేస్తున్నారు.
ఇకపై సోనూను సినిమాల్లో విలన్‌గా చూపిస్తే ఒప్పుకోమంటూ జనాలు తేల్చి చెప్పేస్తున్నారు. ఇది కూడా అతడిపై ప్రేమను వ్యక్తం చేయడంలో భాగమే. మామూలుగా స్టార్ హీరోల్ని పూ నెగెటివ్ పాత్రల్లో చూడటానికి అభిమానులు ఒప్పుకోరు. ఇప్పుడు సోనూ విషయంలోనూ అదే పరిస్థితి తలెత్తింది.
కాబట్టి ఇకపై అతడికి ఫిలిం మేకర్స్ విలన్ పాత్రలు ఆఫర్ చేస్తారా అన్నది సందేహమే. ఇదే జరిగితే సోనూకు అవకాశాల పరిధి తగ్గిపోయినట్లే. నిజ జీవితంలో సోనూ హీరో అయ్యాడని అతణ్ని హీరోగా పెట్టి సినిమాలు తీస్తారనీ చెప్పలేం. ఇప్పుడు అతడి రియల్ లైఫ్ ఇమేజ్‌కు తగ్గట్లు పాజిటివ్ టచ్ ఉన్న స్పెషల్ క్యారెక్టర్లు డిజైన్ చేయాలి.
ఇలా ఎంతమంది చేస్తారు.. ఇలాంటి పాత్రలు ఎన్ని వస్తాయి అన్నది సందేహం. మరోవైపు వ్యక్తిగా చాలా గొప్ప స్థాయికి ఎదిగిపోయిన సోనూ విషయంలో స్టార్ హీరోలు ఇన్ సెక్యూర్ ఫీలింగ్‌తో తమ సినిమాలకు దూరం పెట్టే అవకాశాలూ లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెచ్చుకున్న ఇమేజ్ వల్ల సోనూ సినీ కెరీర్ దెబ్బతినకుంటే చాలు అనుకోవాలి.
This post was last modified on July 28, 2020 4:59 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…