బలగం అనే చిన్న సినిమా గత వారం రిలీజైనపుడు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. ఇది పక్కా తెలంగాణ నేటివిటీతో తెరకెక్కిన సినిమా కావడంతో ఆంధ్రా వైపు మినిమం బజ్ కనిపించలేదు. తొలి రోజు థియేటర్లు వెలవెలబోయాయి. తెలంగాణలో పరిస్థితి మెరుగే కానీ.. ఇక్కడ కూడా చాలా చోట్ల ఆక్యుపెన్సీలు అంతంతమాత్రంగా కనిపించాయి. సినిమాకు మంచి టాక్ వచ్చినా కూడా తొలి వీకెండ్లో సినిమా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కానీ రోజులు గడిచేకొద్దీ పరిస్థితి మారిపోయింది.
సోషల్ మీడియాలో ‘బలగం’ గురించి పెద్ద చర్చ జరగడం.. ఇది తప్పక చూడాల్సిన సినిమా అనే అభిప్రాయం పెద్ద ఎత్తున వినిపించడంతో జనాల్లో కదలిక వచ్చింది. నెమ్మదిగా సినిమాకు ఆక్యుపెన్సీ పెరుగుతూ పోయింది. సెకండ్ వీకెండ్ వచ్చేసరికి ఒక కొత్త సినిమా కోసం ఎగబడ్డట్లు జనం ఈ సినిమా చూసేందుకు ఎగబడుతున్నారు.
తెలంగాణ అంతటా మంచి ఆక్యుపెన్సీతో ‘బలగం’ నడుస్తోంది. విశేషం ఏంటంటే.. పాత రోజులను గుర్తు చేస్తూ పల్లెటూళ్ల నుంచి బస్సులు, ట్రాక్టర్లు వేసుకుని ఈ సినిమా చూసేందుకు టౌన్లకు వస్తుండటం విశేషం. తాజాగా ప్రియదర్శి కూడా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. పాత రోజుల్లో ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లలో సినిమాలు చూసేందుకు టౌన్లకు జనాలు వచ్చేవారు. ఇప్పుడు నాటి రోజులను గుర్తు చేస్తూ ‘బలగం’ పల్లె జనాలను థియేటర్లకు రప్పిస్తోంది.
తెలంగాణ టౌన్లలో ‘బలగం’ ఆడుతున్న థియేటర్లలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. తొలి వీకెండ్‌తో పోలిస్తే కొన్ని రెట్ల ఆధాయం, ఆక్యుపెన్సీ ఇప్పుడు వస్తుండటం విశేషం. కమర్షియల్‌గా పెద్ద సక్సెస్ దిశగా దూసుకెళ్తున్న ఈ చిత్రం.. భవిష్యత్తులో అనేక అవార్డులను కూడా అందుకున్నా ఆశ్చర్యం లేదు. కమెడియన్ వేణు ఈ సినిమాతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయాడు.
This post was last modified on March 12, 2023 8:18 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…