రానా నాయుడు.. ఇప్పుడు తెలుగు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తున్న వెబ్ సిరీస్. ఈ సిరీస్ మేకర్స్ అందరూ బాలీవుడ్ వాళ్లే కానీ.. ఇందులో లీడ్ రోల్స్ చేసింది మాత్రం టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, ఆయన అన్న కొడుకు రానా దగ్గుబాటి. వెంకీ తొలిసారి చేస్తున్న టీవీ షో కావడంతో ఆయన అభిమానులు చాలా ఉత్కంఠగా దీని కోసం ఎదురు చూశారు. కానీ వెంకీ పాత్రను ఇందులో ప్రెజెంట్ చేసిన విధానం.. ఆయనతో పలికించిన బూతులు.. ఇప్పించిన హావభావాలు చూసి జనాలు షాకైపోతున్నారు.
ఇక ఈ సిరీస్‌లో ఎరోటిక్ సీన్ల గురించి చెప్పడానికి చాలానే ఉంది. వెబ్ సిరీస్‌ల్లో శృంగార సన్నివేశాలు కొత్తేమీ కాదు కానీ.. ఇందులో అవి మరీ జుగుప్సాకరంగా ఉండటం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇండియాలో ఓ వెబ్ సిరీస్ విషయంలో ఇంత వ్యతిరేకత రావడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు.
వెంకీ ఉన్నాడు కదా అని ‘రానా నాయుడు’ మొదలుపెట్టి.. తట్టుకోలేక ఆరంభ దశలోనే వదిలేసిన వాళ్లే ఎక్కువమంది. ఐతే ఇలాంటి సిరీస్‌లు అలవాటైన వాళ్లు మాత్రం ‘రానా నాయుడు’ను చూస్తున్నట్లున్నారు. ఇందులో హాట్ హాట్ సీన్ల కోసమే చూసేవాళ్లు కూడా లేకపోలేదు. ఐతే కంటెంట్ పరంగా చాలా వీక్ కావడంతో ‘రానా నాయుడు’కు మైనస్ అయింది.
ఓవైపు పూర్ రేటింగ్స్ తెచ్చుకోవడం, మరోవైపు వెంకీ అభిమానుల నుంచి వ్యతిరేకత ఊహించని స్థాయిలో ఉండటంతో దీని సీక్వెల్స్ విషయంలో నెట్ ఫ్లిక్స్ పునరాలోచనలో పడే ఛాన్సుంది. నిజానికి ఈ సిరీస్‌లను మూడు సీజన్ల పాటు నడిపించాలన్నది ప్లాన్ అట. ఆ మేరకు ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో నెట్‌ఫ్లిక్స్ ఒప్పందం చేసుకుంది. కానీ తొలి సీజన్‌కు రెస్పాన్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఇప్పుడు మిగతా రెండు సీజన్లు సందిగ్ధంలో పడ్డాయి. కానీ నెట్‌ఫ్లిక్స్ ఇలాంటి వాటికి జడిసే రకం అయితే కాదు. కాబట్టి ఇంకో రెండు సీజన్లు కూడా దించుతుందేమో చూద్దాం.
This post was last modified on March 12, 2023 8:13 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…