గత నెలన్నర నుంచి సార్, బలగం తప్ప చెప్పుకోదగ్గ భారీ హిట్లు ఏవి లేని టైంలో అసలైన మాస్ సినిమా కోసం ప్రేక్షకులతో పాటు ట్రేడ్ సైతం ఎదురు చూస్తోంది. హఠాత్తుగా ఫిక్స్ చేసుకుని ప్రమోషన్లు మొదలుపెట్టినప్పటికీ విశ్వక్ సేన్ దాస్ కా ధమ్కీ మీద చెప్పుకోదగ్గ అంచనాలైతే మొదలవుతున్నాయి. తన స్వీయ దర్శకత్వం నిర్మాణంలో రూపొందుతున్న ఈ మసాలా ఎంటర్ టైనర్ లో విశ్వక్ డ్యూయల్ రోల్ చేయడం విశేషం. ఈ రోజు జరిగిన ఈవెంట్ లో ట్రైలర్ ని రిలీజ్ చేశారు. గతంలోనూ ఒకటి వదిలారు కానీ ఈసారి మరింత స్పష్టంగా కథేంటో అర్థమయ్యేలా కట్ చేశారు.
క్యాన్సర్ పేషేంట్లను కాపాడే ఒక అద్భుతమైన డ్రగ్ కనిపెడతాడు డాక్టర్ సంజయ్(విశ్వక్ సేన్). దీన్ని ప్రపంచానికి అందివ్వాలన్న గొప్ప సంకల్పంతో ఉన్న ఇతన్ని విధి ప్రమాదం రూపంలో వెక్కిరిస్తుంది. కారు యాక్సిడెంట్ లో చనిపోతాడు. అయితే ఇది బయటకి తెలియనివ్వకుండా అచ్చం సంజయ్ పోలికల్లోనే ఉంటూ స్లమ్ ఏరియాలో పుట్టి పెరిగిన దాస్(విశ్వక్ సేన్)ని తీసుకొస్తాడు ఈ వ్యవహారంలో కీలక భూమిక పోషించిన మేనేజర్(రావు రమేష్). పోలీసులు, ఆ డ్రగ్ కోసం కుట్రలు పన్నుతున్న ప్రత్యర్థులు ఇలా పెద్ద వలయంలో ఇరుక్కుంటాడు దాస్.
స్టోరీ పరంగా అన్ని అంశాలు కూడినట్టే ఉన్నా కొన్ని పోలికలు గుర్తుకొస్తున్నాయి. గౌతమ్ నందా, ధమాకా, హలో బ్రదర్ ఇలా డబుల్ ఫోటోల సినిమాల్లోని కొన్ని పాయింట్స్ తీసుకుని రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ దీన్ని తయారు చేసినట్టు కనిపిస్తోంది. హీరోయిన్ నివేత పేతురాజ్ గ్లామర్ డోస్ పెంచినట్టుంది. లియోన్ జేమ్స్ సంగీతం, దినేష్ కె బాబు ఛాయాగ్రహణం సమకూర్చారు. రెండు షేడ్స్ లో విశ్వక్ ఎప్పటి లాగే మంచి ఎనర్జీతో చేశాడు. ప్లాట్ ని ఇంత ఓపెన్ గా ట్రైలర్స్ లో చూపించారంటే దాస్ కా ధమ్కీ మీద టీమ్ కు గట్టి కాన్ఫిడెన్సే ఉంది. అదే నిజమైతే హిట్టు పడ్డట్టే.
This post was last modified on March 12, 2023 8:09 pm
కెరీర్లో ఎన్నడూ లేని విధంగా సుదీర్ఘ విరామం తీసుకున్న మంచు మనోజ్.. ఈ ఏడాదే రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.…
ఒకప్పుడు మలయాళ ఫిలిం ఇండస్ట్రీ టాప్ హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగాడు దిలీప్. మోహన్ లాల్, మమ్ముట్టిల తర్వాత…
‘పవన్ కల్యాణ్ డిఫరెంట్ ఫీల్డ్ నుంచి వచ్చారు. స్ట్రగుల్ అవుతున్నారు. అయినా బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారు’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు…
దురంధర్ ఎక్కడ ఆగుతుందో అర్థం కాక బాలీవుడ్ ట్రేడ్ పండితులు తలలు పట్టుకుంటున్నారు. మాములుగా మంగళవారం లాంటి వీక్ డేస్…
రాజా సాబ్ నుంచి రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. దర్శకుడు మారుతీ లిరికల్స్ కు పరిమితం కాకుండా ఏకంగా వీడియో…
చెల్లెలికి బర్త్‌డే విషెస్ చెప్పని అన్న… వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది కదా! పాలిటిక్స్‌లో అది ఎవరై ఉంటారు? అని ఎవరైనా…