థియేటర్ కు ఓటిటికి మధ్య కనీసం ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలని అప్పుడెప్పుడో నిర్మాతలు స్ట్రైక్ చేసిన టైంలో అనుకున్నారు కానీ దాన్ని ఒక్కళ్ళంటే ఒకళ్ళు పాటించలేదు. సరే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి కాబట్టి ఎవరినీ నిందించలేం పైగా పరిస్థితులు అలా ఉండటంతో నిర్మాతల మండలి సైతం చూసీ చూడనట్టు వదిలేస్తోంది. ఆఖరికి టైటిల్స్ కు ముందే స్ట్రీమింగ్ పార్ట్ నర్ లోగో వేయకూడదని పెట్టుకున్న నిబంధన సైతం అమలు కావడం లేదు. మహా అయితే భారీ బ్లాక్ బస్టర్ సినిమాలు పాటిస్తున్న గరిష్ట గడువు నెలన్నర కంటే ఎక్కువ లేదు.
గత నెల శివరాత్రికి విడుదలై తమిళంలో కంటే తెలుగులోనే గొప్ప విజయం అందుకున్న సార్ అప్పుడే డిజిటల్ లోకి రానుంది. ఈ నెల 17న అంటే శుక్రవారం నుంచి ఫ్యామిలీ సమేతంగా నెట్ ఫ్లిక్స్ ఉంటే ఇంట్లోనే చూసుకోవచ్చు. థియేట్రికల్ రిలీజ్ జరిగిన ముప్పై రోజులకు స్మార్ట్ విడుదలన్న మాట. ఇదే బ్యానర్ నుంచి వచ్చిన బుట్టబొమ్మకు సైతం ఇదే సూత్రం ఫాలో అయ్యారు. నిజానికి సార్ ఇంత పెద్ద విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు, ధనుష్ కెరీర్ లో తిరు తర్వాత అతి తక్కువ టైంలో మరో వంద కోట్ల బొమ్మగా వాతి/సర్ రికార్డు అందుకుంది.
ఓటిటి వ్యూస్ భారీగా ఉంటాయనడంలో సందేహం అక్కర్లేదు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో నాగ వంశీ నిర్మించిన ఈ ఎమోషనల్ డ్రామా డ్రైగా సాగిన ఫిబ్రవరికి మంచి ఆక్సీజన్ ఇచ్చింది. ఎలాగూ 17 నుంచి కొత్త సినిమాలు రాబోతున్నాయి. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి మీద ఓ మోస్తరు అంచనాలు ఉండగా కబ్జకి కెజిఎఫ్ రేంజ్ లో బిల్డప్ ఇస్తున్నారు. వారం తిరక్కుండానే దాస్ కా ధమ్కీ, రంగమార్తాండలు వచ్చేస్తాయి. ఇక నెలాఖరుకు దసరా ఉండనే ఉంది. వీటి మధ్య సార్ ఇంకా జనాలను థియేటర్ కు రప్పించడం కష్టం కాబట్టి సరైన నిర్ణయమే తీసుకున్నాడు.
This post was last modified on March 12, 2023 11:49 am
పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గొప్ప సక్సెసయ్యాక ఇప్పుడు అందరి చూపు గేమ్ ఛేంజర్ మీదకు వెళ్తోంది.…
‘పుష్ప-2’ ట్రైలర్ లాంచ్ నార్త్ ఇండియాలో చేస్తున్నారంటే ఢిల్లీ, ముంబయి లాంటి సిటీల్లో ప్రెస్ను పిలిచి సింపుల్గా చేసేస్తారని అనుకున్నారంతా.…
ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈ ఏడాది ఆమె నుంచి వరుసగా క్రేజీ…
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు,…
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్శకుడైనంత మాత్రాన చట్టాలు పాటించరా? అని…