విభిన్నమైన కథలు చేస్తున్నా ఛలో తరువాత మళ్ళీ ఆ స్థాయి విజయం అందుకోలేకపోయిన నాగ శౌర్య ఈసారి ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయితో వస్తున్నాడు. వచ్చే వారం 17న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇవాళ జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ ని లాంచ్ చేశారు. నటుడిగానే కాక ఊహలు గుసగుసలాడే, జో అచ్యుతానంద లాంటి ఫీల్ గుడ్ మూవీస్ తో దర్శకుడిగానూ మంచి పేరు తెచ్చుకున్న అవసరాల శ్రీనివాస్ కొంత గ్యాప్ తీసుకుని ఈ రామ్ కామ్ లవ్ ఎంటర్ టైనర్ తో వస్తున్నారు. కబ్జతో పోటీ పడబోతున్న అబ్బాయి అమ్మాయి యూత్ ని టార్గెట్ చేసుకున్నారు.
కాలేజీలో చదువుకునే రోజుల్లో సంజయ్(నాగశౌర్య) అనుపమ(మాళవిక నాయర్)లు జూనియర్ సీనియర్ గా పరిచయమవుతారు. మొదట్లో సాధారణంగా ఉన్న ఈ స్నేహం క్రమంగా ప్రేమగా మారుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుని ఐ లవ్ యు కూడా చెప్పుకుంటారు. ఈలోగా కొన్ని అనూహ్య పరిణామాలు తర్వాత బ్రేకప్. కట్ చేస్తే కొంత కాలం తర్వాత అనుపమ జీవితంలో మరో యువకుడు(అవసరాల శ్రీనివాస్)వస్తాడు. ఇటు సంజయ్ లైఫ్ లోనూ ఇంకో అమ్మాయి(మేఘా చౌదరి) వస్తుంది. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ కలుసుకున్న ఈ ఇద్దరి ప్రయాణం ఏ మలుపు తీసుకుందనేది తెరమీదే చూడాలి.
ట్రైలర్ మొత్తం అవసరాల మార్క్ సాఫ్ట్ విజువల్స్ నిండిపోయాయి. లైన్ పరంగా మరీ కొత్తగా అనిపించలేదు కానీ యువతను లక్ష్యంగా చేసుకుని సున్నితమైన సంబంధాలు, భావోద్వేగాలను చూపించే ప్రయత్నం బలంగా చేశారు. హిట్టా ఫట్టా తేల్చబోయేది ఈ అంశమే. నాగశౌర్య మూడు రకాల గెటప్స్ ని ట్రై చేశాడు. మాళవిక నాయర్ తన సహజమైన నటనతో అనుపమగా ఒదిగిపోయింది. కళ్యాణి మాలిక్ మెలోడీ మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. మొత్తానికి అబ్బాయి అమ్మాయి వెరైటీగా లేకపోయినా కూల్ ఆండ్ స్వీట్ గా ఆకట్టుకునేలా ఉన్నారు. సినిమా కూడా ఇలాగే ఉంటే జోడి కుదిరినట్టే.
This post was last modified on March 12, 2023 7:19 am
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…
జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…
ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చరిక చేసింది. ఆయన తప్పు చేసినట్టు నిరూపితమైతే.. కచ్చితంగా…