గత నాలుగైదు రోజులుగా సోషల్ మీడియా వేదికగా కెజిఎఫ్ మీద జరుగుతున్న కామెంట్ల యుద్ధం చూస్తూనే ఉన్నాం. దర్శకుడు వెంకటేష్ మహా అందులో రాఖీ భాయ్ క్యారెక్టరైజేషన్ గురించి అన్న మాటలు పెద్ద దుమారానికి దారి తీశాయి. కమర్షియల్ వర్సెస్ క్లాస్ సినిమా మీద పెద్ద ఎత్తున డిబేట్లు జరిగాయి. తాజాగా హరీష్ శంకర్ తనదైన శైలిలో దీనికి సమాధానం చెప్పి ఇష్యూని చల్లార్చే ప్రయత్నం చేశారు. సున్నితంగా రెండింటి మధ్య తేడాలను వివరిస్తూనే ఎవరినీ నొప్పించకుండా ఆడియన్స్ వైపు నుంచి ఎలా ఆలోచించాలో ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులకూ క్లారిటీ ఇచ్చారు.
దీని కోసం ఆయన తీసుకున్న ఉదాహరణ సాగర సంగమం. ఆ మూవీలో ఎస్పి శైలజకు కమల్ హాసన్ నృత్య భంగిమలు నేర్పిస్తున్నప్పుడు ఆ గెటప్ చూసి ఇలాంటి మనిషికి ఎంత గొప్ప ఫ్లాష్ ఉందోనని ఎదురు చూస్తామని దాని కన్నా గూస్ బంప్స్ ఇంకేం కావాలని వివరించారు. ఇదే ఫీలింగ్ బాషాలో రజనీకాంత్ నేను మాణిక్యం నాకింకో పేరుందని చెప్పినప్పుడూ కలుగుతుందని, అలాంటప్పుడు మాస్ క్లాస్ అంటూ మనం విభజించుకోవడమే తప్ప ఆడియన్స్ దృష్టిలో అలాంటి భేదాలు ఉండవని ఎమోషన్ ఉంటే కథ ఏదైనా పాసవుతుందని తేల్చేశారు.
శంకరాభరణం టైంలో జనాలు బళ్ళు కట్టుకుని థియేటర్లకు వచ్చిన ఉదంతాన్ని చెప్పారు. నిజానికి ఇలాంటి వివరణలిప్పుడు చాలా అవసరం. ఇదంతా బలగం సక్సెస్ మీట్ లో జరిగింది. లాజికల్ గా ఆలోచిస్తే హ్యాపీ డేస్, ఫిదా, పెళ్లి చూపులు, నువ్వే కావాలి, ఆనందం, నువ్వు లేక నేను లేను, నువ్వు నేను ఇవన్నీ యూత్ ఫుల్ లవ్ అండ్ ఎంటర్ టైన్మెంట్ సినిమాలు. భారీ వసూళ్లతో కోట్లు కొల్లగొట్టాయి. కొన్నిటికి ఇండస్ట్రీ రికార్డులు దక్కాయి. ఎందులోనూ బ్లాస్టింగులు, ఐటెం పాటలు, భారీ ఫైట్లు, గ్రాఫిక్స్ ఏమీ ఉండవు. సో నచ్చేలా తీయాలే కానీ పబ్లిక్ సినిమాలో హీరోలెవరనేది పట్టించుకోరు.
This post was last modified on March 11, 2023 10:35 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…