Movie News

సమీక్ష – రానా నాయుడు

ఒక పెద్ద స్టార్ ఓటిటి ఎంట్రీ ఇస్తే అదేం చిన్న న్యూస్ కాదు. అందులోనూ నెట్ ఫ్లిక్స్ లాంటి డిజిటల్ దిగ్గజం నిర్మిస్తే ఇక అంచనాలకు హద్దేముంటుంది. విక్టరీ వెంకటేష్ రానా నాయుడులో భాగమైనప్పుడు ఫ్యాన్స్ లో పెద్ద చర్చే జరిగింది. పైగా తాము తెరమీద చూడాలనుకున్న బాబాయ్ అబ్బాయ్ కాంబినేషన్ ని ఇలా స్మార్ట్ స్క్రీన్ కి తీసుకురావడం పట్ల కొంత ఫీలైనా బాగుంటే చాలనుకున్నారు. ఫైనల్ గా వాళ్ళు కోరుకున్నది మూవీ లవర్స్ ఎదురు చూసింది జరిగిపోయింది. ఇంట్లో వాళ్ళతో కలిసి చూడొద్దంటూ ముందే హింట్ ఇచ్చిన రానా మాటలు కొంత అనుమానం రేపిన మాట వాస్తవమే. మరి రానా నాయుడులు మెప్పించేంత మేజిక్ చేశారా లేదా చూద్దాం.

ముంబైలో ఏ సెలబ్రిటీకి ఎలాంటి సమస్య వచ్చినా దానికి పరిష్కారం చూపించే వ్యక్తి రానా నాయుడు(దగ్గుబాటి రానా). భార్య ఇద్దరు పిల్లలతో చక్కని ఫ్యామిలీ. మరో అన్నయ్య తమ్ముడు విడిగా ఉంటారు. రానాకు తండ్రంటే విపరీతమైన ద్వేషం. పదిహేనేళ్ళు జైలుశిక్ష పూర్తి చేసుకుని బయటికొచ్చిన నాగ నాయుడు(వెంకటేష్) రాగానే కుటుంబాన్ని కలవడానికి వస్తాడు. విచిత్రమైన మనస్తత్వం ఉన్న నాగ వచ్చాక వీళ్ళ జీవితాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయి. పరస్పరం రగిలిపోయే నాగా రానాల సంఘర్షణే అసలు కథ.

వెబ్ సిరీస్ లకు ఒక గ్రామర్ ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో దాన్ని నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు ఎప్పుడో రాసి పెట్టాయి. వీళ్ళ ప్రొడక్షన్ లో ఎవరు కంటెంట్ తీయాలన్నా ఖచ్చితంగా వాటిని ఫాలో కావాల్సిందే. అందులో నగ్నత్వం, పచ్చిగా మాట్లాడే బూతులు, సాంప్రదాయ వాదులకు ఏ మాత్రం నచ్చని విచిత్రమైన మానవ సంబంధాలు ఇలా ఎన్నో జొప్పించాల్సి ఉంటుంది. లేదూ నేను వాటికి దూరం అలాంటివి రాయలేను తీయలేను అంటే వాళ్లకు తలుపులు మూసేస్తారు. వెంకటేష్ లాంటి బడా టాలీవుడ్ స్టార్ ఉన్నప్పటికీ రానా నాయుడు ఈ ఫార్ములాకు లోబడక తప్పలేదు. జనరేషన్ మారింది కాబట్టి ఇలా తీయడం తప్పు కాదేమోనని అనుకుని ఉంటారు.

బేసిక్ గా ఈ స్టోరీ తండ్రి కొడుకుల మధ్య క్లాష్ చుట్టూ అల్లుకున్నది. అమెరికన్ పాపులర్ టెలివిజన్ సిరీస్ రే డొనోవాని అడాప్ట్ చేసుకున్న దర్శకులు కరణ్ అంశుమన్, సుపర్న్ వర్మలు పైన చెప్పిన ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ని ఫాలో అవుతూ ట్రూ రీమేక్ చేయాలని తాపత్రయపడ్డారే తప్పించి మన ఆడియన్స్ అభిరుచులు ఆలోచనలకు అనుగుణంగా మార్పులు చేసేందుకు ప్రయత్నించలేదు. ఫలితంగా ఇందులో బలంగా ఉండాల్సిన కాంఫ్లిక్ట్ పాయింట్ చప్పగా అనిపిస్తుంది. నాగా నాయుడు అంత శిక్ష అనుభవించి బయటికి వచ్చాక అతని గతంలో ఏం జరిగిందనే ఆసక్తి మనలో మొదలవుతుంది. దానికి సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాం.

అయితే పాత్రలను రిజిస్టర్ చేసే క్రమంలో కరణ్ సుపర్న్ లు మరీ ఎక్కువ సమయం తీసుకోవడంతో విపరీతమైన ల్యాగ్ అనిపిస్తుంది. సన్నివేశాలు వస్తూ వెళ్తుంటాయి తప్పించి ఎక్కువ డెప్త్ కనిపించదు. దానికి తోడు అవసరం ఉన్నా లేకపోయినా న్యూడిటీని, సెక్స్ సీన్స్ ని పదే పదే రిపీట్ చేయడంతో ఎంత యూత్ అయినా సరే వాళ్లకూ ఇదంతా అవసరం లేని వ్యవహారం లాగే అనిపిస్తుంది. తెలుగు డబ్బింగులో బూతులు విచ్చలవిడిగా వాడేశారు. నిజ జీవితంలోనూ ఇలాగే మాట్లాడుకుంటారు కదాని లాజిక్ చెబితే దానికి జాలి పడటం తప్ప ఏం చేయలేం. నలుగురి మధ్య వాడుకునే పదాల ప్రభావం కన్నా కోట్లాది ప్రేక్షకులకు చేరే సినిమా చాలా శక్తివంతమైంది.

నాగా నాయుడు ఫ్లాష్ బ్యాక్ లో జరిగిన విషాదాన్ని, అతను ముంబై వచ్చాక ఒక్కొక్కరిని టార్గెట్ చేసుకుంటూ బెదిరించే వైనాన్ని ప్రాపర్ గా రాసుకుని ఉంటే మంచి థ్రిల్లర్ అయ్యేది. కరణ్ సుపర్న్ ఆ ఛాన్స్ మిస్ చేశారు. అలా అని అస్సలు బాలేదని కాదు. సగం ఎపిసోడ్లు అయ్యాక అసలు ట్విస్టులను విప్పుకుంటూ పోవడం వల్ల అప్పటికే తగ్గిపోయిన ఆసక్తి నీరసం తెప్పించేయడంతో అంతో ఇంతో బాగున్న చివరి భాగాలు కూడా చప్పగానే అనిపిస్తాయి. ది ఫ్యామిలీ మ్యాన్, మీర్జాపూర్ లాంటి బ్లాక్ బస్టర్లకు ఇలాంటి సమస్య ఎందుకు రాలేదంటే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే వల్ల. రానా నాయుడు రైటింగ్ టీమ్ ఈ విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోలేకపోయారు. ఇదే ప్రధాన మైనస్.

ఖచ్చితంగా ఇంత నిడివి ఉండాలనే రూల్ ని ఫాలో కావడం రానా నాయుడు సాగతీతకు కారణమయ్యింది. నాగాకు నలుగురు కొడుకులని ఎస్టాబ్లిష్ చేసే క్రమం కూడా సరిగా కుదరలేదు. దాంతో రానా పిల్లలు తమ తాతయ్య, పెదనాన్న, చిన్నన్నలతో ఉండాల్సిన ఎమోషనల్ బాండింగ్ ని సరిగా కనెక్ట్ చేయలేకపోయారు. చివరి రెండు ఎపిసోడ్లలో కొంత వేగం పెరిగినా అది ఫైనల్ గా చాలా బాగుందని చెప్పడానికి సరిపోలేదు. సినిమా స్టార్, మధ్యవర్తి, రౌడీ షీటర్, దొంగ బాబా, మాజీ హీరోయిన్, పక్కింట్లో మ్యూజిక్ వాయించే కుర్రాడు ఇలా ఎన్నో క్యారెక్టర్లు ఉన్నప్పటికీ వాటి మధ్య ఇంటర్ లింక్స్ ని సరిగా వాడుకోలేకపోవడంతో రానా నాయుడు మేజిక్ చేయలేకపోయారు

వెంకటేష్ మాసిపోయిన తెల్లజుట్టు గెడ్డంతో కొత్తగా ఉండటమే కాదు చాలా ఈజ్ తో నాగా నాయుడుగా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. రానా సీరియస్ లుక్స్ తో మొదటి నుంచి చివరి దాక ఒకే టోన్ ని మైంటైన్ చేశాడు. వీళ్ళిద్దరూ కాకుండా ఇంకెవరు చేసినా సిరీస్ మధ్యలోనే కట్టేయాల్సి వచ్చేది. సుర్వీన్ చావ్లా, ఆదిత్య మీనన్, ఆశిష్ విద్యార్ధి, గౌరవ్ చోప్రా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ , సుచిత్ర పిళ్ళై తదితరులతో క్యాస్టింగ్ చక్కగా కుదిరింది. వంక పెట్టేందుకు ఛాన్స్ ఇవ్వలేదు. ప్రేక్షకులతో పాటు దర్శకుల దృష్టి వెంకీ రానాల మీదే ఉండిపోయింది కాబట్టి అందరినీ పూర్తిగా వాడుకోవడంలో తడబడ్డారు. అందరూ రాజ్ అండ్ డికె లాగా తీయలేరు కదా

జాన్ స్టీవర్ట్ ఏడూరి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థీమ్ కి తగ్గట్టు మంచి సౌండ్ తో సాగింది. ఎక్కడా చెవులకు చిల్లులు పెట్టే శబ్దాలు పెట్టకుండా అండర్ టోన్ బాగా మైంటైన్ చేశారు. జయ కృష్ణ గుమ్మడి ఛాయాగ్రహణం సినిమాకే మాత్రం తీసిపోని స్థాయిలో ఉంది. క్వాలిటీని స్క్రీన్ నిండా చూపించారు. రచనలో బివిఎస్ రవి కూడా ఓ చెయ్యేశారు కానీ టీమ్ మొత్తం బాలీవుడ్ బ్యాచే. సంభాషణల్లో ఆ వాసనలు మరీ పచ్చిగా గుప్పుమంటాయి. నినద్ – అశ్విన్ మెహతాల ఎడిటింగ్ లో లోపాలున్నాయి కానీ ముందే చెప్పుకున్నట్టు లెన్త్ విషయంలో కత్తెర వేయడానికి ఛాన్స్ తక్కువగా ఉంటుంది కనక నిందించలేం. నెట్ ఫ్లిక్స్ ప్రొడక్షన్ మాత్రం గ్రాండ్ లుక్ ని ఇచ్చింది.

ప్లస్ పాయింట్స్

వెంకటేష్ నటన
రానా పాత్ర
స్టోరీ ప్లాట్

మైనస్ పాయింట్స్

విపరీతమైన సాగతీత
సరిగా కుదరని క్యారెక్టరైజేషన్స్
అడల్ట్ జోకులు సన్నివేశాలు

ఫినిషింగ్ టచ్ : పెద్దల నాయుడు

రేటింగ్ : 2.5/5

This post was last modified on March 11, 2023 10:28 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రిలయన్స్ న్యూ కరెన్సీ.. జియో కాయిన్

ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…

2 minutes ago

కాళేశ్వరం వివాదం.. కీలక వివరాలతో వచ్చిన వి.ప్రకాశ్

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…

1 hour ago

ప్రాణాలు కాపాడుకుందామని రైలు నుంచి దూకితే.. మరో రైలు గుద్దేసింది

బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…

1 hour ago

ఆ సినిమాల నుంచి నన్ను తీసేశారు – అక్షయ్

బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…

2 hours ago

తిరుపతి తొక్కిసలాటపై న్యాయ విచారణ

ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…

2 hours ago

ఎంపీలో ఘోరం!… శోభనానికి ముందు కన్యత్వ పరీక్ష!

దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…

2 hours ago