ఒక్కోసారి స్క్రీన్ ముందు కనిపించే ట్విస్టుల కన్నా వెనుక జరిగేవి మహా ఇంటరెస్టింగ్ గా ఉంటాయి. నాగార్జున హీరోగా రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ ప్రాజెక్ట్ లాకైన సంగతి తెలిసిందే. ఇది 2019లో వచ్చిన మలయాళం సూపర్ హిట్ పోరింజు మరియం జొస్ కు రీమేక్. హక్కులను అఫీషియల్ గానే కొన్నారు. ఈ వ్యవహారం అభిషేక్ అగర్వాల్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భాగస్వాములుగా ఉన్నప్పుడు జరిగింది. కానీ రైట్స్ అగర్వాల్ పేరు మీద కొనుగోలు చేశారు. ఒరిజినల్ వెర్షన్ ని యధాతథంగా తీస్తే వర్కౌట్ కాదని గుర్తించిన ప్రసన్న కీలక మార్పులు చేసుకున్నాడు.
నాగ్ పాత్రను రెండు వయసుల్లో చూపించడం, అందులో లేని కామెడీ ట్రాక్ ని జోడించడం, అల్లరి నరేష్ రాజ్ తరుణ్ క్యారెక్టర్లకు తగినంత స్కోప్ ఇవ్వడం లాంటివి చాలానే జరిగాయట. అయితే అంతకు ముందు కమిట్ మెంట్ల ప్రకారం ఇది నిర్మాత చిట్టూరి శ్రీనుకి చేయాల్సి వచ్చింది. కానీ అభిషేక్ అగర్వాల్ దానికి ఇష్టపడకపోవడంతో హక్కుల బదలాయింపు మధ్యలోనే ఆగిపోయింది. తీరా చూస్తే నిన్న ఉన్నట్టుండి అభిషేక్ బృందం నుంచి మరియం రీమేక్ ప్రకటన వచ్చేయడంతో అభిమానులు కన్ఫ్యూజ్ అయ్యారు. ఇది వేరేదా లేక ప్రసన్న కుమార్ పూర్తిగా కొత్త కథ రాసుకుని ఇదే తరహా బ్యాక్ డ్రాప్ పెట్టుకుంటాడా అంతు చిక్కలేదు.
ఈ తాజా అనౌన్స్ మెంట్ తో స్టోరీ వేరే మలుపులు తిరిగింది. ఫైనల్ గా నాగార్జున ప్రసన్న కలయికలో రాబోయేది రీమేకా ఫ్రెష్శానేది తేలాలంటే వేచి చూడాలి. అసలే అక్కినేని అభిమానులు దీని మీద బోలెడు ఆశలు పెట్టుకున్నారు. అల్లరి అల్లుడు, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, సోగ్గాడే చిన్ని నాయనా రేంజ్ విలేజ్ మాస్ చూడొచ్చని వెయిట్ చేస్తున్న టైంలో ఇప్పుడీ ఝలక్ వచ్చి పడింది. అందుకే ఓపెనింగ్ చేయలేదనే టాక్ కూడా ఉంది. ఇలాంటి ఇష్యూస్ రావడం సహజమే కానీ లోలోపల మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారమయ్యేవి. మరి దీనికేం చేస్తారో వేచి చూడాలి. డెబ్యూతోనే ప్రసన్నకు సవాళ్లు మొదలయ్యాయి.
This post was last modified on March 10, 2023 10:18 am
మంగళగిరి నియోజకవర్గం పేరు చెప్పగానే ఠక్కున ఇప్పుడు నారా లోకేష్ గుర్తుకు వస్తున్నారు. నియోజక వర్గంలో చేపడుతున్న పనులు కావొచ్చు..…
మాములుగా కొత్త సినిమాల విడుదల రోజు తెల్లవారుఝాము లేదా అర్ధరాత్రి షోలు వేయడం సహజం. కానీ నాలుగో రోజు మిడ్…
గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…
చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…
తన ప్రియురాలి కోసం చైన్ స్నాచింగ్స్ దొంగగా మారిన ఒక ప్రియుడు... బైకుల మీద స్పీడుగా వెళుతూ మహిళల మెడల…