కమెడియన్లు హీరోలుగా చేయడం చాలాసార్లు చూశాం. అలీ, సునీల్ నుంచి సప్తగిరి దాకా ఎందరో హిట్లు కొట్టారు. అయితే అవన్నీ హాస్యభరిత చిత్రాలే తప్ప సీరియస్ గా ఎప్పుడూ ట్రై చేయలేదు. బ్రహ్మానందం బాబాయ్ హోటల్ తో జంధ్యాల ప్రయత్నించారు కానీ అది ఆశించిన స్థాయిలో ఆడలేదు. అందులోనూ ఎంటర్ టైన్మెంట్ ఉంటుంది. కానీ కోలీవుడ్ కల్ట్ దర్శకుడు వెట్రిమారన్ కొత్త చిత్రం విడుతలై కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టేలా ఉంది. తమిళ డబ్బింగ్ సినిమాలతో సూరి మనకూ పరిచయమే. సూర్య, విజయ్ ల పక్కన జోకులు వేస్తూ నవ్విస్తూ ఉంటాడు.
ఇతను కానిస్టేబుల్ గా చేసిన మూవీనే విడుతలై పార్ట్ 1. నిన్న ట్రైలర్ రిలీజ్ చేశారు. వీడియో మొత్తం ఇంటెన్స్ డ్రామాతో విజువల్స్ ని నింపేశారు. నక్సల్స్ ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో పోలీసుల అరాచకాలు ఏ స్థాయిలో ఉంటాయి, వాళ్ళ నాయకుడిని పట్టుకునే నెపంతో ఆ వర్గానికి చెందిన ఆడవాళ్ళతో ఖాకీ జులుం చేసిన దుర్మార్గాలు ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు చూపించారు. నాయకుడిగా విజయ్ సేతుపతి నటించగా పోలీస్ అధికారిగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ కు మరో కీలకమైన పాత్ర దక్కింది. ఇళయరాజా సంగీతం అందించగా ఇది రెండు భాగాలుగా రాబోతోంది.
అంచనాలు పెంచేలానే విడుతలై ప్రమోషన్ చేస్తున్నారు వెట్రిమారన్. తెలుగులో ఇలాంటివి గతంలో వచ్చాయి. ముఖ్యంగా రేవతి ప్రధాన పాత్ర పోషించిన అంకురం ఎప్పటికీ మర్చిపోలేని క్లాసిక్. అందులో ఈ తరహా నేపధ్యమే ఉంటుంది. సామజిక అంశాల మీద వెనుకబడిన వర్గాల అణిచివేత మీద మాత్రమే సినిమాలు తీసే వెట్రిమారన్ తర్వాత ధనుష్, జూనియర్ ఎన్టీఆర్ లతో ప్లాన్ చేసుకున్నాడు కానీ అవెంతవరకు కార్యరూపం దాలుస్తాయో చూడాలి. అన్నట్టు ఈ విడుతలై మార్చి 31 విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. అదే జరిగితే తమిళనాడులో నాని దసరాకు కొంత చిక్కు తప్పదు
This post was last modified on March 9, 2023 10:34 am
విశ్వక్ సేన్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ లైలా. ఆడవేషం వేసి నరేష్ పాత సినిమా చిత్రం భళారే విచిత్రంలాగా…
#AskKavitha- హ్యాష్ ట్యాగ్తో నెటిజన్ల నుంచి అభిప్రాయాలు సేకరించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.. ఇదే సమయంలో పలువురు నెటిజన్లు…
భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంగీత విద్వాంసుల్లో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి స్థానం ఎవరూ భర్తీ చేయనిది, అందుకోలేనిది. దక్షిణాదిలోనే కాదు…
మాటిచ్చిన కేవలం పదిరోజుల్లోనే ఆ హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. తొమ్మిది రోజుల క్రితం చిలకలూరిపేట…
నటుడిగా చాలా గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ ఈ ఏడాది రెండు సినిమాల్లో విలన్ గా నటించి కంబ్యాక్ అయ్యాడు.…
హర్యానాలో పనిచేస్తున్న తెలుగు ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటనలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ…