రెండు రోజుల నుంచి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి జట్టు కట్టబోతోందని.. బన్నీ ప్రస్తుతం నటిస్తున్న ‘పుష్ప-2’లోనే ఆమె భాగం కాబోతోందన్నది ఆ వార్త. ఫస్ట్ పార్ట్‌లో రష్మిక మందన్నా కథానాయికగా కనిపించగా.. రెండో భాగంలోనూ ఆమె కొనసాగుతోంది.
మళ్లీ కొత్తగా సాయిపల్లవి కోసం ఒక పాత్ర సృష్టించారని.. ఈ పాత్రను ఆమెకు ఆఫర్ చేయగానే ఓకే చెప్పేసిందని.. త్వరలో షూటింగ్‌కు కూడా హాజరు కాబోతోందని రూమర్ రాయుళ్లు వార్తలు అల్లేశారు. ఈ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా అభిమానులు కూడా ఎగ్జైట్ అవుతున్నారు. ఐతే ఈ వార్త నిజమేనా అని ‘పుష్ప-2’ టీం సభ్యుడు ఒకరిని అడగ్గా.. అది జస్ట్ రూమర్ మాత్రమే అని, అందులో ఎంతమాత్రం నిజం లేదని.. సినిమాలో ఇంకో హీరోయిన్ పాత్రకు ఛాన్సే లేదని తేల్చేశారు.
లాజికల్‌గా ఆలోచిస్తే సాయిపల్లవి ఈ సినిమాలో నటించేందుకు ఛాన్సే లేదని అర్థమైపోతుంది. సాయిపల్లవి స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి పెర్ఫామర్.. సుకుమార్ సినిమాలో ఒక పాత్ర చేసిందంటే అది మామూలుగా హైలైట్ అవదు. అప్పుడు రష్మిక మందన్నా చేసిన హీరోయిన్ పాత్ర కచ్చితంగా మరుగున పడిపోతుంది.
ఫోకస్ అంతా సాయిపల్లవి మీదికి వెళ్లిపోతుంది. అప్పుడు హీరో-విలన్ పాత్రలు కూడా కొంచెం తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. ఆల్రెడీ హీరోయిన్ కాకుండా అనసూయ రూపంలో ఒక కీలకమైన లేడీ క్యారెక్టర్ ఉంది. ఆ పాత్ర రెండో భాగంలో కూడా కొనసాగుతోంది.
అలాంటపుడు సాయిపల్లవి కోసం ఇంకో పాత్రను క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ ఈ చిత్రంలో ఒక ఐటెం సాంగ్ ఉంటుందన్నది మాత్రం వాస్తవం. ఫస్ట్ పార్ట్‌లో సమంత మాదిరే ఒక స్టార్ హీరోయిన్ ఆ పాటలో మెరవబోతోంది. అది సాయిపల్లవి మాత్రం కాదన్నది స్పష్టం.
This post was last modified on March 8, 2023 10:33 pm
సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…
ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…
నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…
రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…