Movie News

కాజల్ తన కొడుక్కి చూపించే తొలి సినిమా?


టాలీవుడ్ చరిత్రలోనే చాలా పెద్ద రేంజికి వెళ్లిన కథానాయికల్లో కాజల్ అగర్వాల్. చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్.. ఇలా టాలీవుడ్లో చాలామంది టాప్ స్టార్లతో ఆమె సినిమాలు చేసింది. తమిళం, హిందీల్లోనూ పెద్ద పెద్ద హీరోలతో జట్టు కట్టింది. దాదాపు దశాబ్దంన్నర పాటు హవా సాగించిన కాజల్.. ఇంకా అవకాశాలు వస్తున్న టైంలోనే కరోనా బ్రేక్‌లో ఉన్నట్లుండి తన స్నేహితుడు గౌతమ్ కిచ్లును పెళ్లాడేసింది.

కాజల్ పెళ్లే అభిమానులకు పెద్ద షాక్ అంటే.. చాలా త్వరగా ఒక బిడ్డను కూడా కనేసిందామె. ఆమెకు గత ఏడాది కొడుకు పుట్టిన సంగతి తెలిసిందే. ఆ బాబుకి నీల్ అనే పేరు పెట్టుకున్నారు కాజల్ దంపతులు. ప్రస్తుతం బుడి బుడి అడుగులు వేస్తున్న నీల్‌తో చాలా సంతోషంగా గడుపుతున్న కాజల్.. రాబోయే కాలంలో తన కొడుకు విషయంలో ఎలా వ్యవహరించబోతున్నానో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.

తన కొడుక్కి ఎనిమిదేళ్ల వయసు వచ్చే వరకు సినిమాలకు పూర్తిగా దూరంగా పెంచబోతున్నట్లు ఆమె చెప్పింది. తనకు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్నీ కూడా దూరంగా పెడుతున్నట్లు చెప్పింది. అంతే కాక తన కొడుక్కి కాస్త ఊహ వచ్చాక తన సినిమాలు చూపిస్తానని.. అప్పుడు ముందుగా ‘తుపాకి’ సినిమాను చూపిస్తానని ఆమె వెల్లడించింది. విజయ్ సరసన కాజల్ కథానాయికగా ఏస్ డైరెక్టర్ మురుగదాస్ రూపొందించిన ‘తుపాకి’ పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఐతే కాజల్ కెరీర్లో పెర్ఫామెన్స్ పరంగా చూస్తే ‘మగధీర’, ‘సీత’ సహా చెప్పుకోదగ్గ సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ ఆమె మాత్రం తాను చాలా మామూలు పాత్ర చేసిన ‘తుపాకి’ని చూపించాలనుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ సంగతిలా ఉంచితే.. కాజల్ త్వరలోనే టాలీవుడ్లో రీఎంట్రీకి రెడీ అవుతోంది. ఆమె అనిల్ రావిపూడి రూపొందిస్తున్న సినిమాలో నందమూరి బాలకృష్ణ సరసన నటించబోతోంది.

This post was last modified on March 8, 2023 2:56 pm

Share

Recent Posts

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

6 minutes ago

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

2 hours ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

3 hours ago

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

4 hours ago

వందల కోట్ల ఆస్తి మిస్సయిన నవదీప్

మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…

4 hours ago

పోటీకి రావడంలో ‘రియాలిటీ’ ఉద్దేశమేంటో

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…

4 hours ago