బాలీవుడ్ లో అత్యంత విజయవంతమైన సీక్వెల్స్ లో ధూమ్ ది ప్రత్యేక స్థానం. దొంగతనాలు చేసే విలన్ ని హీరోగా చూపించి అసలు కథానాయకుడిని సైడ్ ఆర్టిస్టుగా మార్చి ఆడియన్స్ ని మెప్పించడంలో దీని శైలినే వేరు. అభిషేక్ బచ్చన్ కెరీర్ లో కాస్త గట్టిగా చెప్పుకునే బ్లాక్ బస్టర్ ఏదైనా ఉందంటే అది ఇదే. కానీ ఈ సిరీస్ లో నెగటివ్ షేడ్స్ చేసిన జాన్ అబ్రహం, హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ లకు వచ్చిన పేరు కంటే ఇది తక్కువే. అంతగా ఈ రాబరీ డ్రామా ప్రేక్షకులను కట్టి పడేసింది. ఇప్పుడీ ధూమ్ నాలుగో భాగం తెరకెక్కబోతోంది. ఆషామాషీ కాంబినేషన్ తో మాత్రం కాదండోయ్.
ఇటీవలే పఠాన్ రూపంలో తమ సంస్థకే కాక నార్త్ ఇండస్ట్రీ మొత్తానికి వెయ్యి కోట్ల సినిమా అందించిన సిద్దార్థ్ ఆనంద్ కే యష్ రాజ్ ఫిలింస్ నిర్మాణ బాధ్యతను అప్పగించింది. ఈసారి చోరుడిగా షారుఖ్ ఖాన్ నటించబోతున్నాడు. ఈ మేరకు డైరెక్టర్ అధికారికంగా ట్వీట్ పెట్టేశాడు. 2024 క్రిస్మస్ కానుకగా విడుదల చేసేలా ప్లానింగ్ జరుగుతోంది. సిద్దార్థ్ ఆనంద్ ఇటీవలే హృతిక్ దీపికా పదుకునేలతో ఫైటర్ ని పూర్తి చేశాడు. వచ్చే ఏడాది జనవరి 25 రిలీజ్ కానుంది. ఇది కూడా యాక్షన్ ఎంటర్ టైనరే. పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం కేటాయించబోతున్నారు.
ధూమ్ 1,2 దర్శకత్వం వహించింది సంజయ్ గద్వి. ఈ రెండింటితో పోలిస్తే మూడోది ఆ స్థాయిలో అనిపించదు. దీన్ని తీసింది విజయ్ కృష్ణ ఆచార్య. వీళ్ళను కాదని యష్ అధినేతలు సిద్దార్థ్ ఆనంద్ కి ధూమ్ 4 ఇవ్వడం చూస్తే క్రేజ్ ని ఏ స్థాయిలో క్యాష్ చేసుకోవడానికి ప్లాన్ చేశారో అర్థం చేసుకోవచ్చు. పఠాన్ లాంటి రెగ్యులర్ స్పై డ్రామానే నమ్మశక్యం కానీ ఎలివేషన్లతో యాక్షన్ ఎపిసోడ్స్ తో నింపేసిన సిద్దార్థ్ ఇప్పుడీ ధూమ్ ని చేతిలో పెడితే ఏ స్థాయిలో అరాచకం చేస్తారో వేరే చెప్పాలా. అన్నట్టు ఇతను ప్రభాస్ తోనూ ఒక ప్యాన్ ఇండియా మూవీ ప్లాన్ చేసుకున్నాడు. అదెప్పుడు ఉంటుందో.
This post was last modified on March 8, 2023 11:24 am
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై ఈసారి చాలా ఆసక్తిగా మారబోతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి దుబాయ్, పాకిస్థాన్ వేదికలుగా…
తీవ్ర వివాదాలు ఎదురుకుంటూ విపరీతమైన వాయిదాలకు లోనవుతూ వచ్చిన ఎమర్జెన్సీ ఇటీవలే విడుదలయ్యింది. క్రిష్ వదిలేశాక మణికర్ణిక బ్యాలన్స్ పూర్తి…
కరోనా తర్వాత థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిన మాట వాస్తవం. కొవిడ్ టైంలో ఓటీటీలకు బాగా అలవాటు పడ్డాక..…
ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీకి ఫౌజీ టైటిల్…