‘మీ టూ’ ఉద్యమం తర్వాత ఎంతోమంది సెలబ్రెటీ లేడీస్ తమకు ఎదురైన లైంగిక వేధింపుల అనుభవాల గురించి ఓపెన్ అయ్యారు. కొందరు ఈ ఉద్యమాన్ని వాడుకుని తప్పుడు ఆరోపణలు చేశారనే చర్చ కూడా జరిగినప్పటికీ.. మెజారిటీ మహిళలు తమకు జరిగిన అన్యాయాల గురించి ధైర్యంగా బయటికి చెప్పడం మంచి పరిణామం అనే చెప్పాలి. సినిమా హీరోయిన్లు ఎక్కువగా తమ ప్రొఫెషన్లో అవకాశాల పేరుతో తమను ఎలా వేధించారో చెప్పుకున్నారు.
ఐతే ఇప్పుడు ఓ సీనియర్ హీరోయిన్.. తన ఇంట్లో, అది కూడా తన తండ్రి ద్వారా లైంగిక వేధింపులు ఎదుర్కొన్న విషయాన్ని బయటపెట్టడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టి డేరింగ్ లేడీగా పేరు తెచ్చుకున్న ఖుష్బు.. ఇన్నేళ్ల తర్వాత తన చిన్నతనంలో ఎదురైన చేదు అనుభవాల గురించి మాట్లాడడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.
“చిన్నతనంలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న అమ్మాయిలైనా.,. అబ్బాయిలైనా జీవితాంతం బాధ పడుతూనే ఉంటారు. నా తల్లి భయంకరమైన వైవాహిక జీవితాన్ని అనుభవించింది. ఆమె భర్త.. భార్యను, పిల్లల్ని కొట్టడం.. తన ఏకైక కుమార్తెను లైంగికంగా వేధించడం జన్మహక్కుగా భావించిన వ్యక్తి. అతను నాపై లైంగిక దాడి చేసేటప్పటికి నా వయసు కేవలం ఎనిమిదేళ్లు. ఐతే అతడికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం నాకు 15 ఏళ్ల వయసులో వచ్చింది. మొదట్లో ఈ విషయాన్ని చెబితే మా అమ్మ నమ్మదేమో అని భయం ఉండేది. ఎందుకంటే ఆమె ఏం జరిగినా భర్త దేవుడు అనే మైండ్ సెట్‌తో ఉండేది. అందుకే నాకు ఎదురైన అనుభవం గురించి ముందు ఎవరికీ చెప్పుకోలేదు. కానీ ఒక వయసు వచ్చాక ఇదంతా తట్టుకోవడం కష్టమై అతడికి ఎదురు తిరగడం మొదలుపెట్టా. దాంతో అతను ఉన్నపళంగా మమ్మల్ని వదిలేసి ఎటో వెళ్లిపోయాడు. దీంతో జీవనాధారం పోయి తర్వాతి రోజు తిండి దొరుకుతుందో లేదో తెలియని పరిస్థితిలో బతికాం. తర్వాత ధైర్యం కూడకట్టుకుని పరిస్థితులకు ఎదురుగా పోరాడటం నేర్చుకున్నా” అని ఖుష్బు తెలిపింది.
This post was last modified on March 7, 2023 8:22 am
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…