ఇండస్ట్రీలో ఏ హీరోనైనా నడిపించేది సక్సెస్ మాత్రమే. అది బలంగా ఉందా ఆఫర్లు వస్తుంటాయి. లేదూ అంటే త్వరగా తట్టాబుట్టా సర్దుకోవడమో లేదా సపోర్టింగ్ ఆర్టిస్టుగా మారడమో చేయాల్సి ఉంటుంది. కానీ కొందరు అదృష్టవంతులు ఉంటారు. హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా నిర్మాతలు పెట్టుబడులతో రెడీ అవుతారు. థియేటర్లలో ఆడినా ఆడకపోయినా డబ్బింగ్, శాటిలైట్ తదితర హక్కుల రూపంలో ఈజీగా రికవర్ అవ్వొచ్చనే నమ్మకంతో వరసగా సినిమాలు తీస్తుంటారు. డైలాగ్ కింగ్ సాయికుమార్ అబ్బాయి ఆది సాయికుమార్ దీనికి మంచి ఉదాహరణగా నిలుస్తున్నాడు.
ఈ వారం ఇతని కొత్త చిత్రం సిఎస్ఐ సనాతన్ రిలీజ్ కాబోతోంది. బాక్సాఫీస్ వద్ద అసలేమాత్రం పోటీ లేదు. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమాకు బజ్ కూడా జీరోనే. ఈ మూడు నాలుగు రోజుల్లో ప్రమోషన్లు స్పీడ్ పెంచి ఏమైనా హైప్ తీసుకొస్తారేమో చూడాలి. గత ఏడాది 2022లో అదివి ఏకంగా అయిదు విడుదలయ్యాయి. అతిథిదేవోభవ, బ్లాక్, తీస్ మార్ ఖాన్, క్రేజీ ఫెలో, టాప్ గేర్ ఇవేవి కనీస స్థాయిలో ఆడియన్స్ ని మెప్పించలేకపోయాయి. కొన్ని అసలు వచ్చిన సంగతే జనాలకు గుర్తు రానంత తొందరగా మాయమయ్యాయి. సో సిఎస్ఐ సనాతన్ ఏదో అద్భుతం చేయాల్సిందే.
దీని తర్వాత కూడా వరసగా జంగల్, కిరాతక, అమరన్ ఇన్ ది సిటీ చాప్టర్ వన్ ముస్తాబవుతున్నాయి. ఇటీవలే ఆది డిజిటల్ డెబ్యూ చేశాడు. లావణ్య త్రిపాఠితో కలిసి పులి మేక వెబ్ సిరీస్ తో లాంచ్ అయ్యాడు. అది కూడా సోసోగానే రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇలా విజయం లేకుండా అది సాయికుమార్ చేస్తున్న పోరాటం గత పదేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ప్రొడ్యూసర్లు వస్తూనే ఉండటమే ఆశ్చర్యం కలిగించే విషయం. ఓటిటి కాలంలో సక్సెస్ తో సంబంధం లేకుండా ఇంత బిజీగా ఉన్న యూత్ హీరో ఆది ఒక్కడేనేమో. ఈ ఫ్రైడే ఎలాంటి ఫలితం అందుకుంటాడో.
This post was last modified on March 7, 2023 8:03 am
కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారులకు చిక్కిన కచిడి చేప అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. 25 కిలోల బరువున్న ఈ చేప మార్కెట్లో…
ఫిబ్రవరి ఏడు కోసం అక్కినేని అభిమానుల ఎదురు చూపులు మాములుగా లేవు. గత కొంత కాలంగా గట్టిగా చెప్పుకునే బ్లాక్…
అరవింద సమేత.. మహర్షి.. గద్దలకొండ గణేష్.. అల వైకుంఠపురములో... ఇలా ఒక టైంలో తెలుగులో వరుస సక్సెస్‌లతో తిరుగులేని క్రేజ్…
భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద్ తన అద్భుతమైన ప్రదర్శనతో టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.…
1995 దాకా దేశంలో అటు కేంద్ర ప్రభుత్వమైనా… ఇటు రాష్ట్ర ప్రభుత్వాలైనా కొనసాగించింది కేవలం పరిపాలన మాత్రమే. అయితే 1995లో…
ముంబయిలో జరిగిన ఐదో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోసి, కేవలం 37…