ఇరవై ఏళ్ల తర్వాత ‘వాసు’ జంట

విక్టరీ వెంకటేష్, భూమిక కాంబోలో వచ్చిన ‘వాసు’ మూవీ లవర్స్ కి ఫేవరెట్. సినిమా థియేటర్స్ లో ఆశించిన ఫలితం అందుకోలేదు కానీ టీవీలో మాత్రం పెద్ద హిట్. సినిమాలో ఎమోషన్ తో పాటు కామెడీ కోసం మళ్లీ మళ్లీ చూసేవారున్నారు. అందులో వెంకీ, భూమిక జంటకి మంచి మార్కులు దక్కాయి. భూమికకి, వెంకీ లైనేసే సీన్స్ బాగా క్లిక్ అయాయ్యి.

అయితే వాసు తర్వాత ఈ జంట మళ్లీ కనిపించలేదు. భూమిక కొన్నేళ్ళు సినిమాలకు గ్యాప్ తీసుకుంది. మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తుంది. తాజాగా వెంకీ, భూమిక కలిసి హిందీ సినిమాలో నటించారు. ఇరవై ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు కలిసి నటిస్తుండటంతో సోషల్ మీడియా లో వాసు కాంబో ఈజ్ బ్యాక్ అంటూ వెంకీ ఫ్యాన్స్ పోస్టులు పెట్టుకుంటున్నారు.

సల్మాన్ ఖాన్ ‘కిసి కా భాయ్ కిసీ కి జాన్ ‘ సినిమాలో విక్టరీ వెంకటేష్ అన్నయ్య గా నటిస్తున్నాడు. ఈ సినిమా కోసమే వెంకీ భూమిక కలిశారు.తాజాగా ఈ సినిమా నుండి రిలీజైన సాంగ్ లో ఈ ఇద్దరు కలిసి స్టెప్స్ వేశారు. ఇరవై ఏళ్ల తర్వాత జంటగా నటిస్తున్న వాసు కాంబో ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి.