పవన్ తో బోణీ .. వరుస విజయాలు

ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ అందుకుంటూ దూసుకెళ్తున్న హీరోయిన్స్ లో సంయుక్త మీనన్ ఒకరు. పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళ బ్యూటీ ఆ సినిమాతో అదిరిపోయే బోణీ కొట్టింది. స్టార్ హీరోతో లాంచ్ అవ్వడంతో తెలుగులో అమ్మడికి ఆ సినిమా తర్వాత వరుస ఆఫర్స్ వచ్చిపడ్డాయి.

‘భీమ్లా నాయక్’ చేస్తూనే సంయుక్త కళ్యాణ్ రామ్ ‘బింబిసార’లో నటించింది. ఈ సినిమాల్లో సంయుక్తా రెండో హీరోయిన్ గా కనిపించింది. తాజాగా ‘సార్’తో సోలో హీరోయిన్ గా వచ్చి పెద్ద హిట్ అందుకుంది. రిలీజ్ కి ముందే మాస్టారూ సాంగ్ తో బాగా పాపులర్ అయిపోయింది సంయుక్తా. ఈ సినిమాతో తెలుగులో హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది.

దీంతో అమ్మడు ఇప్పుడు టాలీవుడ్ లక్కీ ఛామ్ అయిపోయింది. వరుస సక్సెస్ లతో తెలుగులో ఇప్పుడు మరింత బిజీ హీరోయిన్ గా మారబోతుంది. ప్రస్తుతం తెలుగులో హీరోయిన్ ల కొరత ఉండటం కూడా సంయుక్తాకి కలిసొచ్చింది. పైగా దానికి తోడు వరుస విజయాలు. ఇంక సంయుక్తాను ఆపేదెవరు ? అన్నట్టుగా ఉంది. తెలుగులో సాయి ధరమ్ తేజ్ తో ‘విరూపాక్ష’లో నటించి ఈ సినిమాతో త్వరలోనే ప్రేక్షకులను మళ్ళీ పలకరించబోతున్న సంయుక్తా ప్రస్తుతం మలయాళంలో బూమరాంగ్ అనే సినిమా చేస్తుంది.