కొన్నిసార్లు కొందరు హీరోల సినిమాలతో పోటీ పడటం కంటే మరో రిలీజ్ డేట్ చేసుకొని పోస్ట్ పోన్ చేసుకోవడం ఉత్తమం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకుడు ఒకే రోజు రెండు సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపించడం లేదు కూడా. అయితే కుర్ర హీరో కిరణ్ అబ్బవరం మాత్రం మాస్ మహారాజాకి పోటీ వెళ్తున్నాడు. కిరణ్ అబ్బవరం నటిస్తున్న ‘మీటర్’ సినిమా ఏప్రిల్ 7 న రిలీజ్ అవుతుంది. సరిగ్గా ఇదే రోజు రవితేజ సినిమా ‘రావణాసుర’ బరిలో ఉంది. ఇప్పటికే రిలీజ్ డేట్ తో రవితేజ సినిమాకు ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు.
అయితే ఈ డేట్ మీద ముందు కర్చీఫ్ వేసింది రవితేజనే. వరుస హాలిడేస్ కలిసిరావడంతో ఇలా ప్లాన్ చేసుకున్నారు. అదే ఆలోచనలో కిరణ్ అబ్బవరం సినిమాను ఇటీవలే ఎనౌన్స్ చేశారు మేకర్స్. అయితే రవితేజతో ఇటీవలే యంగ్ హీరో నిఖిల్ పోటీ పడ్డాడు. రవితేజ ‘ధమాకా’ రిలీజైన రోజే నిఖిల్ ’18 పేజెస్’ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. యావరేజ్ టాక్ తో ఓపెనయిన ధమాకా మొదటి రోజు నుండే మంచి వసూళ్లు అందుకుంది. ఫైనల్ రన్ లో 100 గ్రాస్ లిస్టులో చేరి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ‘ధమాకా’ తో పోటీ పడిన ’18 పేజెస్’ ఆశించిన విజయం అందుకోలేకపోయింది. రవితేజ వసూళ్ల ముందు నిఖిల్ సినిమా నిలబడలేకపోయింది.
ఇప్పుడు రవితేజ మంచి ఫామ్ లో ఉన్నాడు. ధమాకా , వాల్తేరు వీరయ్య తో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు అందుకున్నాడు. దీంతో ఆటోమేటిక్ గానే రావణాసుర పై ఎక్స్ పెక్టేషన్స్ నెలకొంటున్నాయి. మరి కిరణ్ అబ్బవరం ఇప్పుడు మీటర్ సినిమాతో రవితేజకి ఎదురెళితే నిఖిల్ కి ఎదురైన పరిస్థితే రిపీట్ అవ్వొచ్చని కొందరు భావిస్తున్నారు. మీటర్ కి మైత్రి సపోర్ట్ ఉంది కాబట్టి థియేటర్స్ బాగానే దొరుకుతాయి. కానీ ఆ రోజు ప్రేక్షకులు కిరణ్ సినిమా కంటే ముందు రవితేజ సినిమాకే ఓటేసే ఛాన్స్ ఉంది. మరి కుర్ర హీరో మాస్ హీరోతో ఎలా నెగ్గుకొస్తాడో ?
This post was last modified on March 4, 2023 9:49 pm
బాలీవుడ్ సుప్రసిద్ధ నటుడు నానా పటేకర్ కన్ను మూయడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. 75 వయసులో చివరి…
కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కినన్ని రీమేక్‌లు మరే భాషలోనూ వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో హిట్టయిన…
ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…
కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…
జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…