నేచురల్ స్టార్ నాని ఇప్పుడు ఏమంత గొప్ప ఫాంలో లేడు. అతడి చివరి సినిమా ‘అంటే సుందరానికీ’ ఓ మోస్తరు టాక్ తెచ్చుకుని కూడా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. అంతకుముందు వచ్చిన ‘శ్యామ్ సింగరాయ్’ ఓ మోస్తరుగా ఆడింది. ఇలాంటి ట్రాక్ రికార్డుతో నాని ఇప్పుడు ట్రేడ్ సర్కిల్లో సంచలనం రేపుతున్నాడు. అతడి కొత్త చిత్రం ‘దసరా’కు హైప్ రోజు రోజుకూ పెరిగిపోతోంది. నాని తొలిసారిగా పూర్తి స్థాయి డీగ్లామరస్ రోల్ చేసిన ఊర మాస్ సినిమా ‘దసరా’కు తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. యుఎస్‌లో సైతం బిజినెస్ భారీగా జరిగింది. దీని రిలీజ్ కూడా పెద్ద హీరోల స్థాయిలో ఉండబోతోందన్నది స్పష్టం.
ఈసారి వేసవి బరిలో టాప్ స్టార్ల సినిమాలు ఏవీ లేవు. ఉన్న వాటిలో అత్యంత హైప్ ఉన్నది ‘దసరా’ చిత్రానికే. ఇప్పటిదాకా నాని చిత్రాలు వేటికీ 50 కోట్లకు మించి బిజినెస్ జరగలేదంటే.. దీనికి మాత్రం బిజినెస్ రూ.80 కోట్లు దాటిపోవడం విశేషం.
ఇక రిలీజ్ పరంగానూ నాని గత సినిమాల రికార్డులన్నింటినీ భారీ తేడాతో కొట్టేయబోతోంది ‘దసరా’. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1500 స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కాబోతోందని అంచనా.
యుఎస్‌లో ఈ సినిమా రిలీజ్ లొకేషన్ల లెక్క చూసి అక్కడి ట్రేడ్ వర్గాలకు దిమ్మదిరిగిపోతోంది. ఏకంగా 500 ప్లస్ లొకేషన్లలో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది ప్రత్యాంగిర సినిమాస్ సంస్థ. టాలీవుడ్ టాప్ స్టార్ల సినిమాలకు ఏమాత్రం తీసిపోని రిలీజ్ ఇది. యుఎస్‌లో 500 ప్లస్ లొకేషన్లలో సినిమాలను రిలీజ్ చేసే హీరోలు టాలీవుడ్లో పట్టుమని పదిమంది కూడా లేరు. ఆ జాబితాలో నాని ఉండడం అంటే చిన్న విషయం కాదు.
పెద్ద స్టార్లు బరిలో లేని వేసవి సీజన్‌ను నాని ఎంత బాగా ఉపయోగించుకుంటున్నాడో చెప్పడానికి ఇది ఉదాహరణ. సినిమాకు పాజిటివ్ టాక్ రావాలే కానీ.. 2 మిలియన్ మార్కును తొలి వీకెండ్లోనే ఈ సినిమా టచ్ చేస్తే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
This post was last modified on March 4, 2023 2:32 pm
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…