నటులు దర్శకులు కావడం కొత్తేమీ కాదు. టాలీవుడ్లో ఆ లిస్టు చాలా పెద్దదే. కానీ అందులో దర్శకులుగా బలమైన ముద్ర వేసిన వాళ్లు తక్కువే. ఇప్పుడు వేణు అనే చిన్న స్థాయి కమెడియన్ దర్శకుడిగా మారాడు. వేణు అంటే వెంటనే జనం గుర్తు పట్టకపోవచ్చు.
జబర్దస్త్ కామెడీ షోలో స్కిట్లు చేసేవాడు.. మున్నా లాంటి సినిమాల్లో కామెడీ రోల్స్ చేశాడు అంటే తప్ప అతణ్ని గుర్తుపట్టలేరు. ఇలాంటి చిన్న స్థాయి కమెడియన్ దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాత సంస్థలో సినిమా తీయడం అంటే చిన్న విషయం కాదు. చాలామంది ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. ఐతే ఈ సినిమా ప్రోమోలు చూస్తే.. విషయం ఉన్నట్లే కనిపించింది. ఈ రోజు థియేటర్లలోకి దిగిన సినిమా చూశాక వేణులో ఎంత టాలెంట్ ఉందో జనాలకు అర్థమవుతోంది.
కమెడియన్ దర్శకత్వం చేశాడంటే కామెడీ ప్రధానంగా ఉంటుందని అనుకుంటాం కానీ.. ఈ సినిమాలో కాస్త కామెడీ ఉన్న మాట, నవ్వులు పండిన మాట వాస్తవమే అయినా.. హైలైట్ మాత్రం ఎమోషన్లే. కలిసి ఉంటే కలదు సుఖం అనే పాయింట్‌ను చాలా హృద్యంగా చెప్పిన తీరు మెప్పిస్తుంది. ఒక చావు చుట్టూ రెండు గంటలకు పైగా సినిమాను నడిపించిన.. ఎవరైనా చనిపోతే కాకి పిండాన్ని ముట్టే పాయింట్ మీద కథను మలుపు తిప్పుతూ ఎంగేజ్ చేసిన విధానం ప్రశంసనీయం.
తెలంగాణ పల్లెటూర్లలో జనాలు, అక్కడి సంస్కృతి, ఆచార వ్యవహారాల చుట్టూ సహజంగా కథాకథనాలను చాలా సహజంగా నడిపించి మార్కులు కొట్టేశాడు వేణు. ఈ సినిమా కమర్షియల్‌గా ఎంత మేర సక్సెస్ అవుతుందో చెప్పలేం కానీ.. దర్శకుడిగా మాత్రం వేణు సత్తా చాటాడు. ఆశ్చర్యపరిచాడు. మున్ముందు ఇలాంటి మంచి సినిమాలను అతడి నుంచి ఆశించవచ్చు.
This post was last modified on March 4, 2023 8:05 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…