ఇంకో ఇరవై రోజుల్లో ఆర్ఆర్ఆర్ మొదటి యానివర్సరి వచ్చేస్తోంది. మన భారతీయలకు దాని మీద మళ్ళీ మళ్ళీ చూసే మోజు తగ్గిపోయింది కానీ అమెరికాలో మాత్రం ఇప్పట్లో ఈ సినిమాను వదిలేలా లేరు. ఆస్కార్ వేడుక దగ్గర పడుతున్న వేళ జక్కన్న సృష్టించిన ఈ మాయాజాలం యుఎస్ లో ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. లాస్ యాంజిల్స్ లో ఉన్న అతి పెద్ద థియేటర్ లో స్పెషల్ స్క్రీనింగ్ వేస్తే మొత్తం హౌస్ ఫుల్ అయిపోయి షోకు ముందు క్యూలలో బారులు తీరిన జనాన్ని వీడియోల రూపంలో బయట పెట్టింది. ప్రపంచంలోనే అతి పెద్ద థియేటర్ ఇది.
మొత్తం 1647 సీటింగ్ కెపాసిటీ ఉన్న ఆ హాలులో వివిధ తరగతులు ఉన్నాయి. అన్ని నిండిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. రాజమౌళి, రామ్ చరణ్, కీరవాణిలు ప్రత్యేకంగా హాజరై విచ్చేసిన వాళ్ళతో ముఖాముఖీ కూడా నిర్వహించారు. రాహుల్ సిప్లిగుంజ్, కాల భైరవలకు అకాడెమి నుంచి అధికారిక ఆహ్వానం అందాక నాటు నాటు పాటకు విజయావకాశాలు పెరిగినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ఓ ఇంగ్లీష్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ మాట్లాడుతూ స్టేజి మీద లైవ్ పెర్ఫార్మన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం అభిమానులను ఎగ్జైట్ మెంట్ కు గురి చేస్తోంది.
ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా వైడ్ ఆర్ఆర్ఆర్ ని మార్చి 10న రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎలాగూ 12న ఆస్కార్ ఈవెంట్ జరుగుతుంది కాబట్టి ఒకవేళ అందరూ కోరుకున్నట్టు అవార్డు వస్తే కనక ఆ సంబరాలేవో నేరుగా సినిమా చూస్తూ థియేటర్లలోనే జరుపుకోవచ్చు. ఆ రోజు చెప్పుకోదగ్గ తెలుగు, బాలీవుడ్ రిలీజులు ఏవీ లేకపోవడంతో ఆడియన్స్ మరోసారి బ్రహ్మరధం పడతారనే అంచనాలు బలంగా ఉన్నాయి. టాలీవుడ్ స్థాయిలో పతాకస్థాయికి తీసుకెళ్లిన బాహుబలిని మించి ఇప్పుడీ ట్రిపులార్ ప్రభంజనం మాములుగా లేదు.
This post was last modified on March 2, 2023 10:30 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…