ప్రస్తుతం కొన్ని సినిమాలు ప్రేక్షకులకు ఎందుకు నచ్చుతున్నాయో , ఎందుకు నచ్చడం లేదో అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. క్రిటిక్స్ తక్కువ రేటింగ్స్ ఇచ్చినా కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతున్నాయి. యావరేజ్ కంటెంట్ తో కూడా కొన్ని సినిమాలు ఆడియన్స్ ను మెప్పిస్తున్నాయి. ఆ లిస్టులో వాల్తేరు వీరయ్య కూడా ఉండనే ఉంది. సంక్రాంతి బరిలో వచ్చిన ఈ మెగా మూవీలో వింటేజ్ చిరును చూపించి మార్కులు కొట్టేశాడు బాబీ.
ఒకప్పటి చిరు వింటేజ్ కామెడీ వాడుకొని ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా చిరు కామెడీ టైమింగ్ ను పర్ఫెక్ట్ గా వాడుకొని ఓ బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. నిజానికి వాల్తేరు వీరయ్య లో బాబీ తీసుకుంది రొటీన్ కథే. రొటీన్ రివేంజ్ యాక్షన్ డ్రామాకి తమ్ముడి సెంటిమెంట్ ఎటాచ్ చేశాడు. ఎమోషన్ పక్కన పెడితే సినిమాలో చిరు కామెడీ వర్కవుట్ అయింది.
ఇప్పుడు భోలా శంకర్ లో కూడా వీరయ్య స్టైల్ లోనే మంచి ఎంటర్టైన్ మెంట్ అందించబోతున్నాడట చిరు. ఈ సినిమాలో ముందే మంచి కామెడీ ప్లాన్ చేసుకున్నాడు మెహర్ రమేష్. తాజాగా వాల్తేరు వీరయ్య సక్సెస్ తర్వాత ఇంకొన్ని మార్పులు చేసి సిస్టర్ సెంటిమెంట్ తగ్గించి కామెడీ కి పెద్ద పీట వేశారట. శ్రీముఖి తో అలాగే మిగతా పాత్రలతో చిరు కామెడీ సీన్స్ బాగా వచ్చాయని తెలుస్తుంది.
ఖైదీ నెంబర్ 150 తర్వాత చిరు కొన్ని సినిమాలు చేసినా అందులో లేని చిరు వింటేజ్ కామెడీ వాల్తేరు వీరయ్య లో ఉండటంతో సినిమా సక్సెస్ అయ్యింది. అందుకే అందులో వర్కవుట్ అయిన కామెడీనే చిరు నమ్ముకొని భోలా శంకర్ లో మరోసారి రిపీట్ చేసి నవ్వించేందుకు రెడీ అవుతున్నాడు. సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా ఫన్ ఉండేలా ప్లాన్ చేసుకున్నాడట మెహర్ రమేశ్. చూడాలి బాబీ సక్సెస్ ఫార్ములాతో మెహర్ మెగా హిట్ కొడతాడా ? లేదా ?
This post was last modified on February 28, 2023 11:05 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…