కాన్ఫిడెన్స్ తో అన్నాడో లేక అన్ని లెక్కలు రిలీజులు చూసుకుని స్టేట్ మెంట్ ఇచ్చాడో కానీ దర్శకుడు వెంకీ అట్లూరి అన్న మాట నిజమవుతోంది. సార్ బాక్సాఫీస్ వద్ద మళ్ళీ పుంజుకుంది. మొదటివారంలో నాలుగు రోజుల తర్వాత హఠాత్తుగా నెమ్మదించినప్పటికీ మొన్న శుక్రవారం వచ్చిన మిస్టర్ కింగ్, కోనసీమ థగ్స్ కనీస స్థాయిలో మెప్పించలేక విఫలమవ్వడంతో ఇదంతా ధనుష్ కి కలిసి వస్తోంది. ఎబి కేంద్రాల్లోనే కాకుండా సి సెంటర్స్ లో కూడా నిన్న ఆదివారం చెప్పుకోదగ్గ స్థాయిలో మంచి ఫిగర్లు నమోదయ్యాయి.
ఫ్యామిలీస్ కి ఫస్ట్ ఆప్షన్ గా ఇదే నిలవడం సార్ కు దన్నుగా నిలుస్తున్న సానుకూలాంశం. ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు నిన్న ఒక్కరోజే సుమారు 2 కోట్ల 40 లక్షల దాకా గ్రాస్ వచ్చిందట. షేర్ రూపంలో చూసుకుంటే కోటి ముప్పై లక్షల దాకా తేలుతుంది. ఇంత మొత్తంలో సగం కూడా అక్షయ్ కుమార్ లేటెస్ట్ మల్టీ స్టారర్ సెల్ఫీకి ఇండియా వైడ్ రాలేదంటే నమ్మలేకపోవచ్చు కానీ అక్షరాలా నిజం. ఏపీ తెలంగాణలో చాలా చోట్ల ఈ సినిమాతో పాటు కొత్త ఫ్రైడే రిలీజులు తీసేసి ఆ స్క్రీన్లన్నీ సార్ కు కేటాయించారు.
పోటీగా వచ్చిన వినరో భాగ్యము విష్ణుకథ డీసెంట్ గా రన్ అవుతున్నప్పటికీ నువ్వా నేనా అనే రేంజ్ లో మాత్రం తలపడటం లేదు. కేవలం ఆరు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన సార్ మూడు రెట్ల మార్జిన్ తో 17 కోట్లకు అతి దగ్గరలో ఉంది. విచిత్రంగా తమిళ వెర్షన్ వాతి ఈ స్థాయి దూకుడు చూపించలేకపోవడం గమనార్హం. అక్కడ ధనుష్ మార్కెట్ స్థాయి బిజినెస్ చేశారు. అయితే ఎందుకో మన ఎమోషన్ కోలీవుడ్ ఆడియన్స్ కి పూర్తి స్థాయిలో కనెక్ట్ కాలేకపోయింది. బ్లాక్ బస్టర్ కాదు కానీ సూపర్ హిట్ ముద్రతో బయటపడనుంది.
This post was last modified on February 27, 2023 10:27 pm
నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో ఇప్పుడు ఎక్కడ చూసినా నిర్మాణ రంగ పనులతో కోలాహలంగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రానికి…
కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల.. ప్రజా రాజకీయాల కంటే కూడా.. రచ్చ రాజకీయాలను ఎంచుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తోందని…
తాజాగా జమ్ము కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో.. ఏపీ వాసులు సహా 26 మంది…
మే నెల వచ్చేసింది. ఇంతకు ముందు చెప్పిన ప్రకారం తొమ్మిదో తేదీ రావాల్సిన హరిహర వీరమల్లు నిర్మాణ సంస్థ చెప్పకుండానే…
గత ముప్పై రోజులకు పైగా డ్రై పీరియడ్ నరకం చవి చూసిన థియేటర్లకు మళ్ళీ కళ వచ్చేసింది. నాని హిట్…
ఏపీలో విపక్షం వైసీపీ గతంలో మాదిరిగా దూకుడుగా సాగడం లేదు. వైసీపీ వేస్తున్న ప్రతి అడుగూ బెడిసికొడుతుండటం, అధికార పక్షంపై…