ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న రావణాసుర ఏప్రిల్ విడుదలకు సిద్ధమవుతోంది. మాస్ మహారాజా రవితేజ రెండు వరస బ్లాక్ బస్టర్స్ తో మంచి ఊపుమీదునున్నారు. ధమాకా వంద కోట్ల క్లబ్ లో సులభంగా చెరిపోగా చిరంజీవి సినిమా అయినా సరే వాల్తేరు వీరయ్యలో తన కంట్రిబ్యూషన్ చాలా కీలకమైంది కావడంతో డబుల్ సెంచరీ మార్కు రవి ఖాతాలోనూ పడిపోయింది. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ వరుస డిజాస్టర్లతో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన రవితేజకు ఈ బ్యాక్ టు బ్యాక్ హిట్లు మాములు ఊపునివ్వలేదు. దెబ్బకు నిర్మాతలు మాస్ స్క్రిప్ట్ లతో క్యూ కడుతున్నారు.
ఇదిలా ఉండగా రావణాసురకు సంబంధించిన ఒక కీలక లీక్ ఆసక్తి రేపెలా ఉంది. ఇందులో రవితేజ డ్యూయల్ రోల్ చేయబోతున్నట్టు సమాచారం. అందులో పెద్ద విశేషం లేదు కానీ ఒక పాత్రకు నెగటివ్ షేడ్స్ గట్టిగా ఉంటాయట. ప్రోస్తటిక్స్ వాడి ఇతర మనుషుల మొహాలను ధరించి క్రైమ్ చేసే పాత్రలో మాస్ రాజాని దర్శకుడు సుధీర్ వర్మ చాలా డిఫరెంట్ గా చూపించబోతున్నట్టు వినికిడి. 2019 బెంగాలీలో వచ్చిన విన్సీడా లైన్ నుంచి స్ఫూర్తి చెంది దీన్ని ఇంతకు ముందు ఎవరూ ట్రై చేయని రీతిలో రాసుకున్నట్టు సమాచారం. అంటే ఊర నెగటివ్ మాస్ అన్నమాట.
ఇందులో సుశాంత్ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. రవితేజతో సమానంగా తన స్క్రీన్ స్పేస్ ఉంటుందని యూనిట్ టాక్. ఇంత ప్రాధాన్యం గతంలో ఏ చిత్రంలోనూ దక్కనంత స్పెషల్ గా ట్రీట్ మెంట్ సెట్ చేశారట. సో మొత్తానికి రావణాసుర అంచనాలు భారీగా పెంచేలా ఉంది. లిరికల్ సాంగ్స్ ఆల్రెడీ చార్ట్ బస్టర్ దిశగా పరుగులు పెడుతున్నాయి. ఇదే ఏడాది ఈగల్, టైగర్ నాగేశ్వరరావు రిలీజులను లక్ష్యంగా పెట్టుకున్న రవితేజ దసరాకల్లా మరో మూడు కొత్త సినిమాలు లైన్ లో పెట్టేలా ప్లాన్ చేసుకున్నారు. ఇంత స్పీడ్ యూత్ హీరోల్లో కూడా లేదు.
This post was last modified on February 27, 2023 4:02 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…